శ్రీమహానటుం డగు పరమశివుండు తాండవము చేయుసమయమునందు సనకసనందనాదులగు సిద్ధులును, పాణిన్యాదులగు మునులును పరమాత్మతత్త్వమును తెలిసికొనఁదలంచినవారై యచ్చటికి వెళ్లియుండిరి. మహేశ్వరభగవానుఁ డా వచ్చియున్నవారి యింగిత మెటింగి నాట్యానంతరమునఁ దనచేతిడక్క (డమరుకము)ను పదునాలుగు పర్యాయములు మ్రోఁగించెను. ఆ పదునాలుగు ధ్వనులను, పదునాలుగు సూత్రములుగా వారు గ్రహించిరి. వారిలో భగవానుఁడగు పాణినిముని యాపదునాలుగు సూత్రములను ఆధారముగాఁ జేసికొని యెనిమిది యధ్యాయములుగల (అష్టాధ్యాయి) వ్యాకరణ సూత్రములను రచించెను. సనకాదులుమాత్ర మాసూత్రముల కాత్తతత్త్వ మెఱుంగఁజాలనివారై పరమశివుని పార్షదులలో ముఖ్యుఁ డయిన శ్రీనందికేశ్వరుని సన్నిధి కేఁగి 'యీ పదునాలుగు సూత్రములకును శివభగవానుల వారియుద్దేశ మేమో వివరించి చెప్పు' మని యతనిని ప్రార్థింపఁగా, నతఁడుపోద్ఘాతముగా, "నృత్తావసానే” అను శ్లోకమును, దాని తరువాతి శ్లోకమును, ఆపైని 1-వ సూత్రమునకు 2-3-4-5-6-7 కాశికలను, 2-వ సూత్రమునకు 9-10-11 కాశికలను, 3-వ సూత్రమునకు 12వ కాశికను, 4-వ సూ. 13వ కాశికను, 5వ సూ.14-15 కాశికలను, 6వ సూ. 16వ కాశికను, 7వ సూ. 17వ కాశికను, 8వ సూ. 18 1/2-వ కాశికను, 9వ సూ.19వ కాశికను, 10వ సూ.20వ కాశికను, 11వ సూ. 21,22 వ కాశికలను, 12వ సూ. 23వ కాశికను. 13 వ సూ. 24,25 వ కాశికలను, 14 వ సూ. 26వ కాశికను ఇట్లు 26 కాశికలను రచించెను. అంత వారు కృతార్థులయి యవి గైకొని వెడలిపోయిరి.
శ్రీమహానటుం డగు పరమశివుండు తాండవము చేయుసమయమునందు సనకసనందనాదులగు సిద్ధులును, పాణిన్యాదులగు మునులును పరమాత్మతత్త్వమును తెలిసికొనఁదలంచినవారై యచ్చటికి వెళ్లియుండిరి. మహేశ్వరభగవానుఁ డా వచ్చియున్నవారి యింగిత మెటింగి నాట్యానంతరమునఁ దనచేతిడక్క (డమరుకము)ను పదునాలుగు పర్యాయములు మ్రోఁగించెను. ఆ పదునాలుగు ధ్వనులను, పదునాలుగు సూత్రములుగా వారు గ్రహించిరి. వారిలో భగవానుఁడగు పాణినిముని యాపదునాలుగు సూత్రములను ఆధారముగాఁ జేసికొని యెనిమిది యధ్యాయములుగల (అష్టాధ్యాయి) వ్యాకరణ సూత్రములను రచించెను. సనకాదులుమాత్ర మాసూత్రముల కాత్తతత్త్వ మెఱుంగఁజాలనివారై పరమశివుని పార్షదులలో ముఖ్యుఁ డయిన శ్రీనందికేశ్వరుని సన్నిధి కేఁగి 'యీ పదునాలుగు సూత్రములకును శివభగవానుల వారియుద్దేశ మేమో వివరించి చెప్పు' మని యతనిని ప్రార్థింపఁగా, నతఁడుపోద్ఘాతముగా, "నృత్తావసానే” అను శ్లోకమును, దాని తరువాతి శ్లోకమును, ఆపైని 1-వ సూత్రమునకు 2-3-4-5-6-7 కాశికలను, 2-వ సూత్రమునకు 9-10-11 కాశికలను, 3-వ సూత్రమునకు 12వ కాశికను, 4-వ సూ. 13వ కాశికను, 5వ సూ.14-15 కాశికలను, 6వ సూ. 16వ కాశికను, 7వ సూ. 17వ కాశికను, 8వ సూ. 18 1/2-వ కాశికను, 9వ సూ.19వ కాశికను, 10వ సూ.20వ కాశికను, 11వ సూ. 21,22 వ కాశికలను, 12వ సూ. 23వ కాశికను. 13 వ సూ. 24,25 వ కాశికలను, 14 వ సూ. 26వ కాశికను ఇట్లు 26 కాశికలను రచించెను. అంత వారు కృతార్థులయి యవి గైకొని వెడలిపోయిరి.© 2017,www.logili.com All Rights Reserved.