కంచినాథం నాకు చిరకాలం మిత్రుడు. అతనికి స్నేహితులని చెప్పుకోదగ్గ కొద్దిమందిలో నేనొకడిని. కంచినాథం మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎప్పుడోకాని ఇల్లు కదలని కంచినాథం అంత దూరదేశం ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఇటీవలే నేను ముక్కామలలోని అతని స్వగృహానికి వెళ్లాను. ముక్కామల టూరింగు దగ్గర వున్న మర్రిచెట్టు మలుపులో ఎడమవైపు మొదటి ఇల్లు కంచినాథానిది. ఆ ఇల్లు చాలా వరకు శిథిలమై పోయింది. గోడల మీద జిల్లేడు మొక్కలు గర్వంగా తలెత్తుతున్నాయి. కొంత కాలానికి ఆ చిట్ట చివరి స్మృతి చిహ్నం కూడా కనుమరుగైపోయింది. అక్కడికి అసలు నేనెందుకు వెళ్లాను? దీపం పెట్టని శిథిగృహంలో అసంతృప్తి ఆత్మలు తచ్చాడుతాయని నాకు బాల్యం నుంచి తెలుసు. అందుకే అక్కడికి వెళ్లాను. కాని కంచినాథానికి సంబంధించిన జాడలు ఏమీలేవు.
భూమి ఒక ఊయల... మనిషి ఎల్లప్పటికీ ఊయలలోనే ఉండిపోలేడు...
కంచినాథం నాకు చిరకాలం మిత్రుడు. అతనికి స్నేహితులని చెప్పుకోదగ్గ కొద్దిమందిలో నేనొకడిని. కంచినాథం మూడు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఎప్పుడోకాని ఇల్లు కదలని కంచినాథం అంత దూరదేశం ఎందుకు వెళ్ళాడో తెలియదు. ఇటీవలే నేను ముక్కామలలోని అతని స్వగృహానికి వెళ్లాను. ముక్కామల టూరింగు దగ్గర వున్న మర్రిచెట్టు మలుపులో ఎడమవైపు మొదటి ఇల్లు కంచినాథానిది. ఆ ఇల్లు చాలా వరకు శిథిలమై పోయింది. గోడల మీద జిల్లేడు మొక్కలు గర్వంగా తలెత్తుతున్నాయి. కొంత కాలానికి ఆ చిట్ట చివరి స్మృతి చిహ్నం కూడా కనుమరుగైపోయింది. అక్కడికి అసలు నేనెందుకు వెళ్లాను? దీపం పెట్టని శిథిగృహంలో అసంతృప్తి ఆత్మలు తచ్చాడుతాయని నాకు బాల్యం నుంచి తెలుసు. అందుకే అక్కడికి వెళ్లాను. కాని కంచినాథానికి సంబంధించిన జాడలు ఏమీలేవు. భూమి ఒక ఊయల... మనిషి ఎల్లప్పటికీ ఊయలలోనే ఉండిపోలేడు...© 2017,www.logili.com All Rights Reserved.