తెలరలేచేటప్పటికి నారాయణ కాలేజీ ఆవరణలో గోడ ప్రక్కనున్న దరిసెన చెట్టు మొదట్లో పెద్ద వేరు మీద కూర్చొని ఉంటాడు. అతను ఎమ్ ఏ మొదటి సంవత్సరం విద్యార్థి. తెలివిగలవాడు. మంచి మార్కులు తెచ్చుకొంటాడు. కాని ఇటీవల అతను కాలేజీకి సరిగ్గా రావటం లేదు. చదువు మీద కూడా ధ్యాస తగ్గింది. క్రిందటి త్రైమాసిక పరీక్షలో అతనికి మార్కులు కూడా తక్కువ వచ్చాయి.
నారాయణ పొడగరి. బక్కపలుచన. కోలముఖం. పెద్దకళ్ళు. సన్నని ముక్కు. చామనచాయ. మాసినఫేంటూ, షర్టూ, పాత చెప్పులూ వేసుకొని ఉంటాడు. సిగరెట్టు కాలుస్తూ ఏదో పుస్తకం పేజీలు తిరగేస్తున్నాడు. కాని అతని ధ్యాస పుస్తకం మీద లేదు. ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ప్రక్కన చార్ మినార్ సిగరెట్టు పెట్టె, అగ్గిపెట్టె పెట్టి ఉంటాయి. సిగరెట్టు పారేసి మళ్ళీ సిగరెట్ తీసిముట్టిస్తాడు. అతని స్థితి చూస్తే శారీరకంగానూ, మానసికంగానూ ఏదో ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. అతనికి ఎడమ వైపు కొంతదూరంలో కాలేజీ భవనం కనిపిస్తూ ఉంటుంది. అతను అప్పుడప్పుడు తల ఎత్తికుడివైపుకు చూస్తూ ఉంటాడు. అంటే అటు ముఖద్వారం ఉండి ఉండాలి. నిరాశచెంది మళ్ళీ తలాడించి పుస్తకం వంక చూస్తాడు. కాని అతని ధ్యాసంతా అటే ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నాటకం చదివి తెలుసుకొనగలరు.
తెలరలేచేటప్పటికి నారాయణ కాలేజీ ఆవరణలో గోడ ప్రక్కనున్న దరిసెన చెట్టు మొదట్లో పెద్ద వేరు మీద కూర్చొని ఉంటాడు. అతను ఎమ్ ఏ మొదటి సంవత్సరం విద్యార్థి. తెలివిగలవాడు. మంచి మార్కులు తెచ్చుకొంటాడు. కాని ఇటీవల అతను కాలేజీకి సరిగ్గా రావటం లేదు. చదువు మీద కూడా ధ్యాస తగ్గింది. క్రిందటి త్రైమాసిక పరీక్షలో అతనికి మార్కులు కూడా తక్కువ వచ్చాయి. నారాయణ పొడగరి. బక్కపలుచన. కోలముఖం. పెద్దకళ్ళు. సన్నని ముక్కు. చామనచాయ. మాసినఫేంటూ, షర్టూ, పాత చెప్పులూ వేసుకొని ఉంటాడు. సిగరెట్టు కాలుస్తూ ఏదో పుస్తకం పేజీలు తిరగేస్తున్నాడు. కాని అతని ధ్యాస పుస్తకం మీద లేదు. ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. ప్రక్కన చార్ మినార్ సిగరెట్టు పెట్టె, అగ్గిపెట్టె పెట్టి ఉంటాయి. సిగరెట్టు పారేసి మళ్ళీ సిగరెట్ తీసిముట్టిస్తాడు. అతని స్థితి చూస్తే శారీరకంగానూ, మానసికంగానూ ఏదో ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. అతనికి ఎడమ వైపు కొంతదూరంలో కాలేజీ భవనం కనిపిస్తూ ఉంటుంది. అతను అప్పుడప్పుడు తల ఎత్తికుడివైపుకు చూస్తూ ఉంటాడు. అంటే అటు ముఖద్వారం ఉండి ఉండాలి. నిరాశచెంది మళ్ళీ తలాడించి పుస్తకం వంక చూస్తాడు. కాని అతని ధ్యాసంతా అటే ఉంది. తరువాత ఏం జరిగిందో ఈ నాటకం చదివి తెలుసుకొనగలరు.
© 2017,www.logili.com All Rights Reserved.