వర్షాయామిని
మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి
వీడి క్రొమ్ముడి చెదిరి క్రమ్ముకొన్నవి కురులు
నల్లత్రాచుల వోలె ఒల్లమాలిన ఇరులు
చూపులందని పొరల చీల్చి మూగిన మరులు
ప్రాత తలుపులు గుబులుకొన్నవి పయ్యెదల
ఊర్పు తావులు కొసరి విసిరి చను నీ రేయి,
మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి.
ఆకాశదీపాలు ఆరిపోతున్నాయి
తెగిన ముత్తెపుసరులు జారిపోతున్నాయి
రేగనుల నీలాలు కారిపోతున్నాయి
దెసల చెక్కిలినంటి కారుకాటుక చాయ
నొసటి వ్రాతలు చెరిగి చెమరుకొను నీరేయి.
మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి.
మెరుపు మెరిసినచోట తెరచి మూసిన తలుపు
చిమ్మచీకటి బాట చేరనీయదు మలుపు
ఈరేయి మీటినది ఏనాటిదో పిలుపు
మతుల తీగెల నూపి, స్మృతుల గాయము రేపి
వెతల క్రొంజివురులను పసరుకొను నీరేయి.
మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి.
వర్షాయామిని మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి వీడి క్రొమ్ముడి చెదిరి క్రమ్ముకొన్నవి కురులు నల్లత్రాచుల వోలె ఒల్లమాలిన ఇరులు చూపులందని పొరల చీల్చి మూగిన మరులు ప్రాత తలుపులు గుబులుకొన్నవి పయ్యెదల ఊర్పు తావులు కొసరి విసిరి చను నీ రేయి, మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి. ఆకాశదీపాలు ఆరిపోతున్నాయి తెగిన ముత్తెపుసరులు జారిపోతున్నాయి రేగనుల నీలాలు కారిపోతున్నాయి దెసల చెక్కిలినంటి కారుకాటుక చాయ నొసటి వ్రాతలు చెరిగి చెమరుకొను నీరేయి. మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి. మెరుపు మెరిసినచోట తెరచి మూసిన తలుపు చిమ్మచీకటి బాట చేరనీయదు మలుపు ఈరేయి మీటినది ఏనాటిదో పిలుపు మతుల తీగెల నూపి, స్మృతుల గాయము రేపి వెతల క్రొంజివురులను పసరుకొను నీరేయి. మేఘాల మోహాలు ముసురుకొను నీరేయి.
© 2017,www.logili.com All Rights Reserved.