తూనీగ
ఆమె గాలిలా వీస్తుంది
ఒకరోజు నేను తూనీగలా ఆమె వద్దకు వెళ్లాను
ఆ గాలి ఉద్ధృతికి నాకు ఊపిరాడలేదు
అర్భకుడిని
రెక్కల్లో బలం లేకున్నా ఆకాశంలాంటి ఆమెని
అందుకోవాలని
తపిస్తుంటాను
ఓడిపోతుంటాను
నా రెక్కలు వూడి గాలిలో కలిసినప్పుడే
నేను ఆమెను చేరుతానేమో
© 2017,www.logili.com All Rights Reserved.