కౌమారం అనేది భౌతికంగా ఎంతో వేగంగా ఎదిగే దశ. ప్రత్యేకించి ఆడపిల్లల్లో కౌమార దశ ఆరంభంలో ఎన్నో మార్పులు ఎంతో వేగంగా వస్తూ ఉంటాయి. ఈ మార్పుల వల్ల ఆడపిల్లల్లో తమ శరీరం పట్ల ఆసక్తి, శ్రద్ధ పెరుగుతాయి. ఈ దశలో ఆడపిల్లలు రుతుస్రావానికి సిద్ధంగా లేకపోతే అది ఒక పెద్ద గందరగోళంగా పరిణమిస్తుంది. రుతుస్రావంలో రక్తం పడటంతో శరీరం లోపల భాగాలేమైనా దెబ్బ తిన్నాయేమోనన్న భయం కలుగుతుంది.
అమ్మ దగ్గరికి వెళ్లి తనకు జరిగింది చెబితే దానికి సరైన వివరణలు ఇచ్చే పరిస్థితిలో తల్లి ఉండకపోవచ్చు. సాధారణంగా ఇటువంటి సందర్భాలలో "ఇలా నెలకొకసారి జరుగుతుంది. ఇక నువ్వు అబ్బాయిలకు దూరంగా ఉండాలి," అని తల్లి అనవచ్చు. కొన్ని సందర్భాలలో "ఇక నువ్వు నాన్న పక్కన పడుకోవద్దు," అనో, "అన్నలకు దగ్గరగా తిరగొద్దు," అనో చెప్పవచ్చు. ఆడపిల్లల శరీరంలో ఈ మార్పులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అన్న విషయాలు తెలిస్తే భయం పోయి, ఈ విషయాలను సహజంగా తీసుకొని ఆరోగ్యంగా ఎదుగుతారు. ఆడపిల్లలకు అవసరమయిన విజ్ఞాన్ని అందచేయ్యటమే ఈ పుస్తకం ఉద్దేశం.
కౌమారం అనేది భౌతికంగా ఎంతో వేగంగా ఎదిగే దశ. ప్రత్యేకించి ఆడపిల్లల్లో కౌమార దశ ఆరంభంలో ఎన్నో మార్పులు ఎంతో వేగంగా వస్తూ ఉంటాయి. ఈ మార్పుల వల్ల ఆడపిల్లల్లో తమ శరీరం పట్ల ఆసక్తి, శ్రద్ధ పెరుగుతాయి. ఈ దశలో ఆడపిల్లలు రుతుస్రావానికి సిద్ధంగా లేకపోతే అది ఒక పెద్ద గందరగోళంగా పరిణమిస్తుంది. రుతుస్రావంలో రక్తం పడటంతో శరీరం లోపల భాగాలేమైనా దెబ్బ తిన్నాయేమోనన్న భయం కలుగుతుంది. అమ్మ దగ్గరికి వెళ్లి తనకు జరిగింది చెబితే దానికి సరైన వివరణలు ఇచ్చే పరిస్థితిలో తల్లి ఉండకపోవచ్చు. సాధారణంగా ఇటువంటి సందర్భాలలో "ఇలా నెలకొకసారి జరుగుతుంది. ఇక నువ్వు అబ్బాయిలకు దూరంగా ఉండాలి," అని తల్లి అనవచ్చు. కొన్ని సందర్భాలలో "ఇక నువ్వు నాన్న పక్కన పడుకోవద్దు," అనో, "అన్నలకు దగ్గరగా తిరగొద్దు," అనో చెప్పవచ్చు. ఆడపిల్లల శరీరంలో ఈ మార్పులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అన్న విషయాలు తెలిస్తే భయం పోయి, ఈ విషయాలను సహజంగా తీసుకొని ఆరోగ్యంగా ఎదుగుతారు. ఆడపిల్లలకు అవసరమయిన విజ్ఞాన్ని అందచేయ్యటమే ఈ పుస్తకం ఉద్దేశం.© 2017,www.logili.com All Rights Reserved.