నీలో కొన్నిసార్లు ఉత్సవముంటుంది
అప్పుడు నీకందర్నీ పలకరించాలనిపిస్తుంది. పూలతో, పిట్టలతో, దారినపోయే మనుషులతో తోచిన మాటలన్నీ మాట్లాడాలనిపిస్తుంది. దుఖంచే నేత్రాలపై మృదువుగా ముద్దులు పెట్టాలనిపిస్తుంది. ఎవరేమనుకొంటే ఏమిటని వచ్చీరాని పాటలన్నీ పాడాలనిపిస్తుంది. దేహాన్నొక కెరటం చేసి నర్తించాలనీ, నలుగురు పిల్లల్ని పోగుచేసి పరుగుపందెంలో వాళ్ళతో ఓడిపోవాలని అనిపిస్తుంది.
నీలో కొన్నిసార్లు నిరాశ వుంటుంది
అప్పుడు ప్రకాశిస్తున్న ఎండలోకి ఎవరో చీకటిని ఒంపుతున్నట్లుంటుంది. కనిపించని తలుపులన్నీ మూసుకొంటూ లోలోపలికి వెళ్లిపోవాలనిపిస్తుంది. గండశిలవంటి కాలాన్ని పగులగొట్టి దిగంతాలకి విసిరేయాలనిపిస్తుంది. తెలియని ఉప్పెన ఏదో నలువైపులా నుండీ ముంచేస్తున్నట్లుంటుంది. విసుగువేరు తొలుచుకుంటూ వెళ్లి నిన్ను పూర్తిగా ఖాళీ చేసుకోవాలనిపిస్తుంది.
- బి. వి. వి. ప్రసాద్
నీలో కొన్నిసార్లు ఉత్సవముంటుంది అప్పుడు నీకందర్నీ పలకరించాలనిపిస్తుంది. పూలతో, పిట్టలతో, దారినపోయే మనుషులతో తోచిన మాటలన్నీ మాట్లాడాలనిపిస్తుంది. దుఖంచే నేత్రాలపై మృదువుగా ముద్దులు పెట్టాలనిపిస్తుంది. ఎవరేమనుకొంటే ఏమిటని వచ్చీరాని పాటలన్నీ పాడాలనిపిస్తుంది. దేహాన్నొక కెరటం చేసి నర్తించాలనీ, నలుగురు పిల్లల్ని పోగుచేసి పరుగుపందెంలో వాళ్ళతో ఓడిపోవాలని అనిపిస్తుంది. నీలో కొన్నిసార్లు నిరాశ వుంటుంది అప్పుడు ప్రకాశిస్తున్న ఎండలోకి ఎవరో చీకటిని ఒంపుతున్నట్లుంటుంది. కనిపించని తలుపులన్నీ మూసుకొంటూ లోలోపలికి వెళ్లిపోవాలనిపిస్తుంది. గండశిలవంటి కాలాన్ని పగులగొట్టి దిగంతాలకి విసిరేయాలనిపిస్తుంది. తెలియని ఉప్పెన ఏదో నలువైపులా నుండీ ముంచేస్తున్నట్లుంటుంది. విసుగువేరు తొలుచుకుంటూ వెళ్లి నిన్ను పూర్తిగా ఖాళీ చేసుకోవాలనిపిస్తుంది. - బి. వి. వి. ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.