సావిత్రిని చదవడం, నెమ్మదిగా అది ఓ పారాయణ గ్రంథంగా భావించడం, అందులో ఏదో ఆత్మను తట్టి లేపే స్ఫూర్తిదాయక మంత్రం ఉన్నట్టు అనుభూతి చెందడం .. అలా మొదలైంది సావిత్రితో నా చెలిమి. అది నెమ్మదిగా నా అంతరంగ జీవనంలో భాగమైంది. నేను నిత్యం ముచ్చటించె నెచ్చెలిగా మారింది. నా తోడు సావిత్రిగా మారి, మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా మీ సావిత్రి ఏమంటోంది అని మా జీవన సారధిగా గుర్తించి అడిగేవారు. ఇలా బాహ్య, ఆంతర్య జీవితాల్లో భాగస్వామి అయింది. బాధలో, నిరాశలో ఆశాకిరణమైంది. శ్రీమాత చెప్పినట్లు సావిత్రిలో లేనిదేదీ ఈ విశ్వంలో లేదు. అది పరివర్తనా మంత్రమని ఆమె చెప్పారు. ఇలా జీవితంలో భాగమైన సావిత్రిలో పాఠకులకు, అధ్యయనం చేసేవారికి - అంతరంగ జ్యోతిని వెలిగించే స్ఫూర్తులేకాదు, ప్రతి సందర్భానికి మబ్బులు విడినట్టు ఓ సూచన, ఓ ప్రేరణ, ఓ ప్రకాశం కనపడుతుంది. అది వెలుగుబాట. అది ఆశాకిరణం. మానవ పరిణామం. మానవచరిత్రనించి - ఆత్మానుభవం దాకా అద్భుత సాహసయాత్ర.
సావిత్రిని చదవడం, నెమ్మదిగా అది ఓ పారాయణ గ్రంథంగా భావించడం, అందులో ఏదో ఆత్మను తట్టి లేపే స్ఫూర్తిదాయక మంత్రం ఉన్నట్టు అనుభూతి చెందడం .. అలా మొదలైంది సావిత్రితో నా చెలిమి. అది నెమ్మదిగా నా అంతరంగ జీవనంలో భాగమైంది. నేను నిత్యం ముచ్చటించె నెచ్చెలిగా మారింది. నా తోడు సావిత్రిగా మారి, మా ఇంట్లో చిన్న పిల్లలు కూడా మీ సావిత్రి ఏమంటోంది అని మా జీవన సారధిగా గుర్తించి అడిగేవారు. ఇలా బాహ్య, ఆంతర్య జీవితాల్లో భాగస్వామి అయింది. బాధలో, నిరాశలో ఆశాకిరణమైంది. శ్రీమాత చెప్పినట్లు సావిత్రిలో లేనిదేదీ ఈ విశ్వంలో లేదు. అది పరివర్తనా మంత్రమని ఆమె చెప్పారు. ఇలా జీవితంలో భాగమైన సావిత్రిలో పాఠకులకు, అధ్యయనం చేసేవారికి - అంతరంగ జ్యోతిని వెలిగించే స్ఫూర్తులేకాదు, ప్రతి సందర్భానికి మబ్బులు విడినట్టు ఓ సూచన, ఓ ప్రేరణ, ఓ ప్రకాశం కనపడుతుంది. అది వెలుగుబాట. అది ఆశాకిరణం. మానవ పరిణామం. మానవచరిత్రనించి - ఆత్మానుభవం దాకా అద్భుత సాహసయాత్ర.© 2017,www.logili.com All Rights Reserved.