చాలా చోట్లకు చాలా సందర్భాల్లో, అసంధర్భాల్లో వెళ్ళలేకపోయాను.
వెళ్ళినందువలన, వేళ్ళలేకపోయినందున
అంతే; అంతేలేని, చింతే విడని జ్ఞాపకం
ఉళ్ళో ఇప్పుడెవరు లేరు వృద్దాప్యంలో ఉన్న ఇల్లు తప్ప
ఇల్లంటే చిన్నప్పటి నుంచి నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం;
చిన్ని చిన్ని కిటికీలు రెండు;
కొన్ని దూలాలు; వాకిట్లో ఎదుగుతున్న కొడుకులాంటి వేపచెట్టు.
బెంగగా ఉంటుంది దూరంగా వచ్చేసానని
కలలలోను అవి సంచరిస్తున్నప్పుడు ఏడుస్తూ లేచి, పక్కలో తడుముకుని
దొరక్క వాటిని కన్నీళ్ళతో సముదాయిస్తాను. అప్పటికవి ప్రేమిస్తాయి.
ఇంకా నాలో మిగిలి ఉన్నందుకు అవి నన్ను క్షమిస్తాయి.
ఇంతున్నప్పుడు నన్ను సాకిన రుణంతో వాటిని మోస్తున్నాను.
అవి నన్ను మోస్తున్నాయి
ఒళ్ళంతా పాకిన గజ్జి కురుపుల మీద చల్లుకుని పేడ రొచ్చులో
ఉపశమించాను.
వేపాకు నూరి పుసుకుని కురుపుల్లా మాడి చేదేక్కాను
కాలిబొటనవేలి దెబ్బల్ని ఒంటేలుతో కారుతున్న
రక్తానికి అభిషేకం చేశాను
ఎర్రటి ఎండలో బొబ్బలెక్కిన కాళ్ళ మీద ఆవు మూత్రం రాసుకుని
ఆనందంతో గంతులేసాను.
ఋణమేదో అంతుబట్టని రహస్యమై కలల్ని ముట్టడిస్తుంది
గాయాల సౌందర్య రహస్యమేదో చిక్కని ప్రశ్నగా వెంటాడుతుంది.
-యాకుబ్.
చాలా చోట్లకు చాలా సందర్భాల్లో, అసంధర్భాల్లో వెళ్ళలేకపోయాను. వెళ్ళినందువలన, వేళ్ళలేకపోయినందున అంతే; అంతేలేని, చింతే విడని జ్ఞాపకం ఉళ్ళో ఇప్పుడెవరు లేరు వృద్దాప్యంలో ఉన్న ఇల్లు తప్ప ఇల్లంటే చిన్నప్పటి నుంచి నాలోనే నిద్రిస్తున్న ద్వారబంధం; చిన్ని చిన్ని కిటికీలు రెండు; కొన్ని దూలాలు; వాకిట్లో ఎదుగుతున్న కొడుకులాంటి వేపచెట్టు. బెంగగా ఉంటుంది దూరంగా వచ్చేసానని కలలలోను అవి సంచరిస్తున్నప్పుడు ఏడుస్తూ లేచి, పక్కలో తడుముకుని దొరక్క వాటిని కన్నీళ్ళతో సముదాయిస్తాను. అప్పటికవి ప్రేమిస్తాయి. ఇంకా నాలో మిగిలి ఉన్నందుకు అవి నన్ను క్షమిస్తాయి. ఇంతున్నప్పుడు నన్ను సాకిన రుణంతో వాటిని మోస్తున్నాను. అవి నన్ను మోస్తున్నాయి ఒళ్ళంతా పాకిన గజ్జి కురుపుల మీద చల్లుకుని పేడ రొచ్చులో ఉపశమించాను. వేపాకు నూరి పుసుకుని కురుపుల్లా మాడి చేదేక్కాను కాలిబొటనవేలి దెబ్బల్ని ఒంటేలుతో కారుతున్న రక్తానికి అభిషేకం చేశాను ఎర్రటి ఎండలో బొబ్బలెక్కిన కాళ్ళ మీద ఆవు మూత్రం రాసుకుని ఆనందంతో గంతులేసాను. ఋణమేదో అంతుబట్టని రహస్యమై కలల్ని ముట్టడిస్తుంది గాయాల సౌందర్య రహస్యమేదో చిక్కని ప్రశ్నగా వెంటాడుతుంది. -యాకుబ్.
© 2017,www.logili.com All Rights Reserved.