త్యాగరాజస్వామి దర్శనం చేయించిన
శ్రీరమణగారు
విశ్వసంగీతంలో విరాజిల్లే విరాట్ శ్రీమాన్ త్యాగరాజస్వామి.
సంగీత, సాహిత్యాలు మన భారతీయ సంస్కృతిలో ప్రధానపాత్ర పోషిస్తాయి. మన జాతి ఔన్నత్యాన్ని మణిదీపంలా వెలిగించే వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి.
త్యాగయ్య కృతులు రామార్పణకై సృష్టించిన సంగీత సాహిత్య సమ్మేళనా కుసుమాలు.
అనంతమూ, అప్రమేయమూ అయిన పరతత్వస్ఫూర్తిని భక్తి ద్వారా, నివేదన ద్వారా తన కృతులలో నింపి బాధాతప్త జీవులందరికి ఉపశమన యోగం కలిగించిన మహనీయుడు శ్రీ త్యాగరాజస్వామి. అందుకే ఆయన కృతులు భాషాబేధం లేకుండా దక్షిణాదిన సర్వజనామోదాలై, స్వరబంధురానంద రూపాలై తెలుగుభాష వున్నంత వరకు అజరామరంగా నిల్చిపోతాయి.
కర్ణాటక సంగీతానికి పర్యాయపదంగా శిఖరాయమానంగా నిలిచి పోయిన విరాణ్మూర్తి త్యాగయ్య జీవితం, జీవనవిధానం గురించి మనకు తెలియచెప్పాలన్న ఆర్తితో మహానుభావులు, మేధావులు, తెలుగువారి సంపదలూ అయిన బాపురమణలు త్యాగయ్య జీవితాన్ని చలనచిత్రంగా నాలుగు దశాబ్దాల క్రితం మలచిచూపారు.
బాపుగారు త్యాగయ్యను నిశ్చలచిత్రంగా అలవోకగా గీసి, రమణగారు వారి జీవితంలోని రమణీయ, కమనీయ, కరుణామయ సన్నివేశాలను వ్రాసి సరిపెట్టుకోకుండా చలనచిత్రంగా, కళ్ళెదుట సుమారు మూడు శతాబ్దాలనాటి "ఆ సంగీత సారస్వతమూర్తిని నడయాడించి, పాడించి, మనకు చూపారు.....................
త్యాగరాజస్వామి దర్శనం చేయించిన శ్రీరమణగారు విశ్వసంగీతంలో విరాజిల్లే విరాట్ శ్రీమాన్ త్యాగరాజస్వామి. సంగీత, సాహిత్యాలు మన భారతీయ సంస్కృతిలో ప్రధానపాత్ర పోషిస్తాయి. మన జాతి ఔన్నత్యాన్ని మణిదీపంలా వెలిగించే వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజస్వామి. త్యాగయ్య కృతులు రామార్పణకై సృష్టించిన సంగీత సాహిత్య సమ్మేళనా కుసుమాలు. అనంతమూ, అప్రమేయమూ అయిన పరతత్వస్ఫూర్తిని భక్తి ద్వారా, నివేదన ద్వారా తన కృతులలో నింపి బాధాతప్త జీవులందరికి ఉపశమన యోగం కలిగించిన మహనీయుడు శ్రీ త్యాగరాజస్వామి. అందుకే ఆయన కృతులు భాషాబేధం లేకుండా దక్షిణాదిన సర్వజనామోదాలై, స్వరబంధురానంద రూపాలై తెలుగుభాష వున్నంత వరకు అజరామరంగా నిల్చిపోతాయి. కర్ణాటక సంగీతానికి పర్యాయపదంగా శిఖరాయమానంగా నిలిచి పోయిన విరాణ్మూర్తి త్యాగయ్య జీవితం, జీవనవిధానం గురించి మనకు తెలియచెప్పాలన్న ఆర్తితో మహానుభావులు, మేధావులు, తెలుగువారి సంపదలూ అయిన బాపురమణలు త్యాగయ్య జీవితాన్ని చలనచిత్రంగా నాలుగు దశాబ్దాల క్రితం మలచిచూపారు. బాపుగారు త్యాగయ్యను నిశ్చలచిత్రంగా అలవోకగా గీసి, రమణగారు వారి జీవితంలోని రమణీయ, కమనీయ, కరుణామయ సన్నివేశాలను వ్రాసి సరిపెట్టుకోకుండా చలనచిత్రంగా, కళ్ళెదుట సుమారు మూడు శతాబ్దాలనాటి "ఆ సంగీత సారస్వతమూర్తిని నడయాడించి, పాడించి, మనకు చూపారు.....................© 2017,www.logili.com All Rights Reserved.