డాక్టర్ కత్తిపద్మారావు దళిత వైతాళికులు. ఈ శతాబ్ది సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల ప్రవర్తకుడు. ఈ యుగకవి. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ రిసెర్చ్ సెంటర్ స్థాపించి, ఒక గొప్ప గ్రంథాలయాన్ని రూపొందించారు. ఈతరం నాయకులు, మేధావులు, కవులు ఎందరో పద్మారావుగారి ఉపన్యాసాలుకు, రచనలకు, కవిత్వానికి, ఉద్యమ చైతన్యానికి స్ఫూర్తి చెందారు. సమకాలీనంలో ఆయన ఒక నడుస్తున్న గ్రంథాలయంగా ఎంతో విజ్ఞానాన్ని సమాజానికి అందిస్తున్నారు. ఆయనొక విశ్వవిద్యాలయంగా పనిచేస్తున్నారు.
ఈ గ్రంథం దేశ సామాజిక, రాజకీయ చిత్రపటాన్ని మనకందిస్తుంది. ఆయన అపారమైన అధ్యయనం ఇందులో అక్షరరూపం దాల్చింది. రాజకీయ అర్థశాస్త్రం, రాజకీయ సామాజిక శాస్త్ర అధ్యయనానికి ఈ గ్రంథం ఒక కరదీపిక. ఈ గ్రంథం ఉద్యమకారులను, విద్యావంతులను సమతుల్యంగా జ్ఞానప్రవాహంలోకి తీసుకువెళుతుంది. ఆంధ్రుల సామాజిక చరిత్రను, ఉద్యమాలను అధ్యయనం చేయడానికి, పరిశోధించడానికి పూనుకొనే వారందరికీ ఈ గ్రంథం ఒక విజ్ఞాన సర్వస్వంగా ఉపకరిస్తుంది.
- ప్రచురణకర్తలు
డాక్టర్ కత్తిపద్మారావు దళిత వైతాళికులు. ఈ శతాబ్ది సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల ప్రవర్తకుడు. ఈ యుగకవి. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ రిసెర్చ్ సెంటర్ స్థాపించి, ఒక గొప్ప గ్రంథాలయాన్ని రూపొందించారు. ఈతరం నాయకులు, మేధావులు, కవులు ఎందరో పద్మారావుగారి ఉపన్యాసాలుకు, రచనలకు, కవిత్వానికి, ఉద్యమ చైతన్యానికి స్ఫూర్తి చెందారు. సమకాలీనంలో ఆయన ఒక నడుస్తున్న గ్రంథాలయంగా ఎంతో విజ్ఞానాన్ని సమాజానికి అందిస్తున్నారు. ఆయనొక విశ్వవిద్యాలయంగా పనిచేస్తున్నారు. ఈ గ్రంథం దేశ సామాజిక, రాజకీయ చిత్రపటాన్ని మనకందిస్తుంది. ఆయన అపారమైన అధ్యయనం ఇందులో అక్షరరూపం దాల్చింది. రాజకీయ అర్థశాస్త్రం, రాజకీయ సామాజిక శాస్త్ర అధ్యయనానికి ఈ గ్రంథం ఒక కరదీపిక. ఈ గ్రంథం ఉద్యమకారులను, విద్యావంతులను సమతుల్యంగా జ్ఞానప్రవాహంలోకి తీసుకువెళుతుంది. ఆంధ్రుల సామాజిక చరిత్రను, ఉద్యమాలను అధ్యయనం చేయడానికి, పరిశోధించడానికి పూనుకొనే వారందరికీ ఈ గ్రంథం ఒక విజ్ఞాన సర్వస్వంగా ఉపకరిస్తుంది. - ప్రచురణకర్తలు© 2017,www.logili.com All Rights Reserved.