బృహదారణ్యకాది ద్వాదశోపనిషత్తులకు బ్రహ్మజ్ఞానమే ధ్యేయము. అయితే ఈ ఉపనిషత్తులు లక్ష్యసాధన కొరకు భిన్న భిన్న మార్గాలను అన్వేషించాయి. ఉదాహరణకు ఛాందోగ్యం వల్ల మధువిద్య, ప్రాణవిద్య మొదలైన ఉపాసనామార్గాలను అందుబాటులోకి వచ్చాయి. మాండూక్యం బ్రాహ్మీస్థితి ఓంకార స్వరూపమని నిర్దేశించింది. ప్రస్తుతాంశామైన కేనోపనిషత్తు బ్రాహ్మీస్థితి ఆనందస్వరూపమైన ఉమయని చెబుతున్నది. ఈ రెండు వేరైతే ద్వైతమవుతుంది. ద్వితీయాద్వైభయం అని గదా సూక్తి. భయరహిత స్థితియే ఆనందస్థితి, బ్రాహ్మీస్థితియని గ్రాహ్యము. శ్రీసూక్తంలో ఆనంద స్వరూపంగా వర్ణింపబడినది ఈ ఉమయే గదా.
ఈ ఉపనిషత్తుకు కేన అని పేరు. కేన అనగా ఎవరి చేత అని అర్థం గదా. జీవునికి ఆధారభూతమైన మనస్సు, ప్రాణశక్తి వాక్కు ఇంద్రియాలకు ఆధారశక్తి మూలమేదన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఆనందస్వరూపిణి ఉమయేయని బోధించి ముగిస్తున్నది. శ్రీ కోటీశ్వరరావుగారు తమ అపార పాండిత్యంతో కేన మంత్రార్థం, అరవిందభాష్యానువాదం మనకు సరళమైన భాషలో అందించినందుకు అభినందనీయములు. పాఠకులకు అరవింద సాహిత్యంపై అభిరుచి పెంపొందిస్తుందని ఆశిస్తున్నాను.
- ఫల్గుణ్
బృహదారణ్యకాది ద్వాదశోపనిషత్తులకు బ్రహ్మజ్ఞానమే ధ్యేయము. అయితే ఈ ఉపనిషత్తులు లక్ష్యసాధన కొరకు భిన్న భిన్న మార్గాలను అన్వేషించాయి. ఉదాహరణకు ఛాందోగ్యం వల్ల మధువిద్య, ప్రాణవిద్య మొదలైన ఉపాసనామార్గాలను అందుబాటులోకి వచ్చాయి. మాండూక్యం బ్రాహ్మీస్థితి ఓంకార స్వరూపమని నిర్దేశించింది. ప్రస్తుతాంశామైన కేనోపనిషత్తు బ్రాహ్మీస్థితి ఆనందస్వరూపమైన ఉమయని చెబుతున్నది. ఈ రెండు వేరైతే ద్వైతమవుతుంది. ద్వితీయాద్వైభయం అని గదా సూక్తి. భయరహిత స్థితియే ఆనందస్థితి, బ్రాహ్మీస్థితియని గ్రాహ్యము. శ్రీసూక్తంలో ఆనంద స్వరూపంగా వర్ణింపబడినది ఈ ఉమయే గదా. ఈ ఉపనిషత్తుకు కేన అని పేరు. కేన అనగా ఎవరి చేత అని అర్థం గదా. జీవునికి ఆధారభూతమైన మనస్సు, ప్రాణశక్తి వాక్కు ఇంద్రియాలకు ఆధారశక్తి మూలమేదన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఆనందస్వరూపిణి ఉమయేయని బోధించి ముగిస్తున్నది. శ్రీ కోటీశ్వరరావుగారు తమ అపార పాండిత్యంతో కేన మంత్రార్థం, అరవిందభాష్యానువాదం మనకు సరళమైన భాషలో అందించినందుకు అభినందనీయములు. పాఠకులకు అరవింద సాహిత్యంపై అభిరుచి పెంపొందిస్తుందని ఆశిస్తున్నాను. - ఫల్గుణ్© 2017,www.logili.com All Rights Reserved.