మనిషిలోని విజ్ఞానతృష్ణ విశిష్ష్టమయింది. మనిషిని, ఇతర జీవాలు నుంచి వేరు చేసి చూసేది ఈ తృష్ణ. తెలుసుకోవాలన్న తపన పెరిగేకొద్దీ మనిషిలోని పరిశోధకుడు బయటపడతాడు.
ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్నలతోనే నరుడు వానరాదాశ నుండి నేటి దశకు పరిణామం చెందాడు. చెట్టుమీద నుంచి పైకి కాకుండా కిందకే ఆపిల్ పండు ఎందుకు పడుతుందన్న ఆలోచనే న్యూటన్ "గురుత్వాకర్షణ" సిద్ధాంతానికి మూలమైoది. ప్రతి మనిషికి హేతువాద దృక్పధం కావాలి.
అందుకే కోటి ఆలోచనలు వెలిగిద్దాం... సమాజాన్ని కాంతిమంతం చేద్దాం. మీలోని ఆసక్తిని మండించి మిమ్మల్ని తేజోమయం చేసే రచన ఇది.
పదండి ముందుకు... తేలికయిన శైలి మిమ్మల్ని ఆగనివ్వదు.
-హరి జగదీశ్వర్.