సాంకేతిక జిజ్ఞాస ఆదిమానవుడికి మొదటి నుంచీ ఉన్న లక్షణం. చీకటి నుంచి బయటపడటంకోసం ఉద్భవించినదే దీపం. వెలుతురు కోసం జరిగిన ప్రత్యామ్నాయ ఇంధన పరిశోధనల నుంచి వచ్చినవే నూనె ద్రవ్యాలు. ఆ పరిశ్రమకో పరాకాష్ట విద్యుత్తు. విద్యుత్తు ఉత్పత్తికి శ్రమించిన మొదటి శాస్త్రజ్ఞులు పాశ్చాత్యులు.
ఎలక్ట్రోలిటిక్ పద్దతిలో మొదటి బల్బును వెలిగించిన నాటినుంచి ఈనాటి వరకూ విద్యుత్తు ఉత్పత్తిలో అనేక మార్పులు జరిగి ఇంటింటా దీపానికి, చీకటిని పారద్రోలడానికి దోహదం జరిగింది. అయితే మొదటి శాస్త్రజ్ఞులు పడిన శ్రమ, ఆనాటి ఆర్ధిక, సామాజిక పరిస్థితులు ఈనాడు విద్యుత్తును అనుభవించే వారెవరికీ తెలియదు. ఆనాటి శాస్త్రజ్ఞుల పరిస్టితులను సరళమైన తెలుగులో తెలియజెప్పడానికి సీతారామరెడ్డి చేసిన కృషి అభినందనీయం. పండితులకు పామరులకు కూడా ఈ పుస్తకం సమానంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
- డా ఎన్ ఎస్ ప్రకాశరావు
సాంకేతిక జిజ్ఞాస ఆదిమానవుడికి మొదటి నుంచీ ఉన్న లక్షణం. చీకటి నుంచి బయటపడటంకోసం ఉద్భవించినదే దీపం. వెలుతురు కోసం జరిగిన ప్రత్యామ్నాయ ఇంధన పరిశోధనల నుంచి వచ్చినవే నూనె ద్రవ్యాలు. ఆ పరిశ్రమకో పరాకాష్ట విద్యుత్తు. విద్యుత్తు ఉత్పత్తికి శ్రమించిన మొదటి శాస్త్రజ్ఞులు పాశ్చాత్యులు. ఎలక్ట్రోలిటిక్ పద్దతిలో మొదటి బల్బును వెలిగించిన నాటినుంచి ఈనాటి వరకూ విద్యుత్తు ఉత్పత్తిలో అనేక మార్పులు జరిగి ఇంటింటా దీపానికి, చీకటిని పారద్రోలడానికి దోహదం జరిగింది. అయితే మొదటి శాస్త్రజ్ఞులు పడిన శ్రమ, ఆనాటి ఆర్ధిక, సామాజిక పరిస్థితులు ఈనాడు విద్యుత్తును అనుభవించే వారెవరికీ తెలియదు. ఆనాటి శాస్త్రజ్ఞుల పరిస్టితులను సరళమైన తెలుగులో తెలియజెప్పడానికి సీతారామరెడ్డి చేసిన కృషి అభినందనీయం. పండితులకు పామరులకు కూడా ఈ పుస్తకం సమానంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. - డా ఎన్ ఎస్ ప్రకాశరావు© 2017,www.logili.com All Rights Reserved.