మానవులకు అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం రుచించదు. ఉన్నదంతా ఆ "రుచి" అనే పదంలోనే వుంది. చక్కరపాకంలో ముంచి, వినోదాత్మకంగా రూపొందించి అందిస్తే స్వీకరిస్తారు. అది మనసుకు ఊరట కలిగించేవి అయివుండాలి. తాము జీవిస్తున్న తీరును సమర్థించేది అయివుండాలి. మిగతావారంతా చెడ్డ పనులు చేస్తారు గానీ తను మాత్రం మంచి పనులే చేస్తాడని ప్రోత్సాహించేదై వుండాలి. తన అస్తవ్యస్త జీవితంలో ఏ మాత్రం అలజడి కలిగించని ఆధ్యాత్మిక జ్ఞానమైతే తనకేమీ అభ్యంతరముండదు.
నిజం నిష్ఠూరంగా ఉంటుందనీ, అది మనం ఊహించిని తీరుగా ఉండదనీ, సత్యాన్వేషణకు పూనుకున్న తర్వాత మానసికంగా అది ఏ దుర్గమారణ్యాలకయినా తీసుకుపోగలదనీ చెప్తే, అలాంటి సత్యం ఎవడిక్కావాలండీ అంటాడు. "ఈ ఉన్న అవస్థలు చాలకనా, ఇదొకటి జోడించుకొని మరిన్ని కష్టాలను జత చేసుకోడానికి" అనేస్తాడు.
మానవులకు అసలైన ఆధ్యాత్మిక జ్ఞానం రుచించదు. ఉన్నదంతా ఆ "రుచి" అనే పదంలోనే వుంది. చక్కరపాకంలో ముంచి, వినోదాత్మకంగా రూపొందించి అందిస్తే స్వీకరిస్తారు. అది మనసుకు ఊరట కలిగించేవి అయివుండాలి. తాము జీవిస్తున్న తీరును సమర్థించేది అయివుండాలి. మిగతావారంతా చెడ్డ పనులు చేస్తారు గానీ తను మాత్రం మంచి పనులే చేస్తాడని ప్రోత్సాహించేదై వుండాలి. తన అస్తవ్యస్త జీవితంలో ఏ మాత్రం అలజడి కలిగించని ఆధ్యాత్మిక జ్ఞానమైతే తనకేమీ అభ్యంతరముండదు. నిజం నిష్ఠూరంగా ఉంటుందనీ, అది మనం ఊహించిని తీరుగా ఉండదనీ, సత్యాన్వేషణకు పూనుకున్న తర్వాత మానసికంగా అది ఏ దుర్గమారణ్యాలకయినా తీసుకుపోగలదనీ చెప్తే, అలాంటి సత్యం ఎవడిక్కావాలండీ అంటాడు. "ఈ ఉన్న అవస్థలు చాలకనా, ఇదొకటి జోడించుకొని మరిన్ని కష్టాలను జత చేసుకోడానికి" అనేస్తాడు.© 2017,www.logili.com All Rights Reserved.