సాంకేతిక రంగం ఊహించని రీతిలో పరిణామం చెందుతుంది. ఇదివరకు ప్రయాణానికి వినియోగించే ఎడ్లబండ్ల స్థానంలో ఇప్పుడు విమానాల సౌకర్యం ఉంది. టెలిగ్రాఫ్ స్థంభం పై బిగించిన వైర్లతో పనిచేసే టెలిఫోన్ స్థానంలో ఇప్పుడు 3జి, 4జి మొబైల్ ఫోన్ లు ప్రత్యేక్షమవుతున్నాయి. శరవేగంతో మార్పులు సంతరించుకుంటున్న సాంకేతిక రంగంతో పాటు వివిధ వ్యక్తుల శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని లక్ష్యసిద్ధిని సాధించే మేనేజ్మెంట్ రంగంలో కూడా గణనీయమైన మార్పులు చేర్పులు జరిగాయి.
అయితే ఈ ఆధునిక యుగంలో పొడచూపుతున్న సంక్లిష్ట సమస్యలను వ్యక్తుల మధ్య పరస్పర బంధాలలో ఉన్నతమైన మార్పులు తీసుకొనిరావడం ద్వారా పరిష్కరించే ప్రయత్నంలో, ఇదివరకు అగ్రతాంబూలం అందుకున్న 'మేథాశక్తి' స్థానాన్ని ఇప్పుడు "ఎమోషనల్ ఇంటలిజెన్స్" అంతకంటే మహోన్నతమైన "స్పిరిచువల్ ఇంటలిజెన్స్" తో చేతులు కలుపుతూ తన పరిధిని విస్తరించుకొంటోంది.
సాంకేతిక రంగం ఊహించని రీతిలో పరిణామం చెందుతుంది. ఇదివరకు ప్రయాణానికి వినియోగించే ఎడ్లబండ్ల స్థానంలో ఇప్పుడు విమానాల సౌకర్యం ఉంది. టెలిగ్రాఫ్ స్థంభం పై బిగించిన వైర్లతో పనిచేసే టెలిఫోన్ స్థానంలో ఇప్పుడు 3జి, 4జి మొబైల్ ఫోన్ లు ప్రత్యేక్షమవుతున్నాయి. శరవేగంతో మార్పులు సంతరించుకుంటున్న సాంకేతిక రంగంతో పాటు వివిధ వ్యక్తుల శక్తి సామర్థ్యాలను వినియోగించుకొని లక్ష్యసిద్ధిని సాధించే మేనేజ్మెంట్ రంగంలో కూడా గణనీయమైన మార్పులు చేర్పులు జరిగాయి. అయితే ఈ ఆధునిక యుగంలో పొడచూపుతున్న సంక్లిష్ట సమస్యలను వ్యక్తుల మధ్య పరస్పర బంధాలలో ఉన్నతమైన మార్పులు తీసుకొనిరావడం ద్వారా పరిష్కరించే ప్రయత్నంలో, ఇదివరకు అగ్రతాంబూలం అందుకున్న 'మేథాశక్తి' స్థానాన్ని ఇప్పుడు "ఎమోషనల్ ఇంటలిజెన్స్" అంతకంటే మహోన్నతమైన "స్పిరిచువల్ ఇంటలిజెన్స్" తో చేతులు కలుపుతూ తన పరిధిని విస్తరించుకొంటోంది.© 2017,www.logili.com All Rights Reserved.