ఇందులో ఉన్న అన్ని కథల్లో అధికభాగం కుటుంబ సంబంధాలు విషయంగానే ఉంటాయి. అలిగిన అమ్మలో, పెట్రోలు ధర పెరగాలని కోరుకున్న మామలూ, ఇతరుల్ని మోసం చేసే ఉద్దేశ్యంతో కాకుండా కుప్పలు తెప్పలుగా అప్పులు చేసిన అప్పారావులూ, కొడుకుని 'గుర్తుపట్టని' తండ్రులూ, 'తండ్రుల్ని దత్తత తీసుకున్న పిల్లలూ, కార్పొరేటర్ మూకుట్లోంచి ఎమ్మెల్యే కుంపట్లో పడ్డ అభాగ్యులూ, దొంగని మనిషి చేసిన సందర్భాలూ, ఇంట్లో తిష్టవేసి పబ్బం గడుపుకునే చుట్టాల్ని తట్టుకోగలిన తెలివైన వాళ్ళు ఇంకా ఇలా ఎన్నో ఆసక్తికరమైన పాత్రలతో, అంశాలతో నిండిన కథలివి.
ఈ కథలన్నీ చదివిన పాఠకులకు వారి వారి అభిరుచుల దృష్ట్యా కొన్ని నచ్చపోవచ్చునుకాని ప్రతి కథా రాయదగ్గ విషయంతోనే ఉందని మాత్రం వాళ్ళూ ఒప్పుకునేలా ఉంటాయి. పేదల పట్ల లోపం లేకుండా సాదాగా, స్పష్టంగా అక్కడక్కడా ఆగి ఆలోచించుకునేలా ఒక మధ్య తరగతి జీవిగా తన జీవనయానాన్ని సాగించిన ఈ రచయిత ఆ కోణంలోంచే ఎక్కువ భాగం తన రచల్ని మనకందించారు. అంతేకాకుండా నేను ప్రత్యేక్షంగా గమనించిన అంశం. చుట్టూ ఏం జరుగుతోందనే జిజ్ఞాస రచయితలో ఉంది. బహుశా వార్తా పత్రికల ద్వారా టెలివిజన్ ద్వారా తను నోటీస్ చేసిన అంశాలను 'రికార్డు' చేసినట్లు కొన్ని కొన్ని కథల్లో వాడటం అభినందనీయం.
ఇందులో ఉన్న అన్ని కథల్లో అధికభాగం కుటుంబ సంబంధాలు విషయంగానే ఉంటాయి. అలిగిన అమ్మలో, పెట్రోలు ధర పెరగాలని కోరుకున్న మామలూ, ఇతరుల్ని మోసం చేసే ఉద్దేశ్యంతో కాకుండా కుప్పలు తెప్పలుగా అప్పులు చేసిన అప్పారావులూ, కొడుకుని 'గుర్తుపట్టని' తండ్రులూ, 'తండ్రుల్ని దత్తత తీసుకున్న పిల్లలూ, కార్పొరేటర్ మూకుట్లోంచి ఎమ్మెల్యే కుంపట్లో పడ్డ అభాగ్యులూ, దొంగని మనిషి చేసిన సందర్భాలూ, ఇంట్లో తిష్టవేసి పబ్బం గడుపుకునే చుట్టాల్ని తట్టుకోగలిన తెలివైన వాళ్ళు ఇంకా ఇలా ఎన్నో ఆసక్తికరమైన పాత్రలతో, అంశాలతో నిండిన కథలివి. ఈ కథలన్నీ చదివిన పాఠకులకు వారి వారి అభిరుచుల దృష్ట్యా కొన్ని నచ్చపోవచ్చునుకాని ప్రతి కథా రాయదగ్గ విషయంతోనే ఉందని మాత్రం వాళ్ళూ ఒప్పుకునేలా ఉంటాయి. పేదల పట్ల లోపం లేకుండా సాదాగా, స్పష్టంగా అక్కడక్కడా ఆగి ఆలోచించుకునేలా ఒక మధ్య తరగతి జీవిగా తన జీవనయానాన్ని సాగించిన ఈ రచయిత ఆ కోణంలోంచే ఎక్కువ భాగం తన రచల్ని మనకందించారు. అంతేకాకుండా నేను ప్రత్యేక్షంగా గమనించిన అంశం. చుట్టూ ఏం జరుగుతోందనే జిజ్ఞాస రచయితలో ఉంది. బహుశా వార్తా పత్రికల ద్వారా టెలివిజన్ ద్వారా తను నోటీస్ చేసిన అంశాలను 'రికార్డు' చేసినట్లు కొన్ని కొన్ని కథల్లో వాడటం అభినందనీయం.© 2017,www.logili.com All Rights Reserved.