తెలుగు సాహిత్యంలో కథాప్రక్రియకు ఉత్తరాంధ్ర అందించిన ఆణిముత్యాల్లో ఒకరు బలివాడ కాంతారావు. భాషాపరంగానూ, వస్తువురీత్యానూ ఉత్తరాంధ్ర జనజీవితం చిత్రించిన రచయితలలో అగ్రేసరులు. వీరు సుమారు 300 కు పైగా కథలు, చిన్నా పెద్దా 32 నవలలు, 5 నాటికలు రాశారు. రేడియో ప్రసంగాలు అనేకం చేశారు. వీరి నవలలు అనేకం హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదం పొందాయి. వీరి కథలు ఎన్నో హిందీ సంకలనాలలో ప్రచురితమయ్యాయి. అందువల్ల భారతదేశ సాహిత్యరంగంలో కాంతారావు గారు ఇతర భాషల పాఠకులకు కూడా సుపరిచితులయ్యారు.
ప్రసిద్ధ సృజనాత్మక రచయితగా కాంతారావు గారికి 'దగాపడిన తమ్ముడు' నవల ఎంతో గుర్తింపు తెచ్చింది. ఈ నవల నేషనల్ బుక్ ట్రస్ట్ వారిచే అన్ని భారతీయ భాషల్లో ప్రచురింపబడింది. వీరి 'పుణ్యభూమి' నవలకు 1972 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 'వంశధార' నవలకు 1986 లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించాయి. 1988 లో గోపీచంద్ అవార్డు, 1996 లో మద్రాస్ కళాసాగర్ వారి విశిష్ఠ పురస్కారం, రావిశాస్త్రి స్మారక పురస్కారం, 1998 లో 'బలివాడ కాంతారావు రచనలపై ఎందరో విద్యార్థులు పరిశోధనలు చేసి ఎం ఫిల్, పిహెచ్ డి డిగ్రీలు సంపాదించారు. యువ విద్యార్థులు, పెద్దలు, కథలు రాస్తున్నవారు, రాయాలనుకునేవారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాల్లాంటి 138 కథల కలశం!
తెలుగు సాహిత్యంలో కథాప్రక్రియకు ఉత్తరాంధ్ర అందించిన ఆణిముత్యాల్లో ఒకరు బలివాడ కాంతారావు. భాషాపరంగానూ, వస్తువురీత్యానూ ఉత్తరాంధ్ర జనజీవితం చిత్రించిన రచయితలలో అగ్రేసరులు. వీరు సుమారు 300 కు పైగా కథలు, చిన్నా పెద్దా 32 నవలలు, 5 నాటికలు రాశారు. రేడియో ప్రసంగాలు అనేకం చేశారు. వీరి నవలలు అనేకం హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదం పొందాయి. వీరి కథలు ఎన్నో హిందీ సంకలనాలలో ప్రచురితమయ్యాయి. అందువల్ల భారతదేశ సాహిత్యరంగంలో కాంతారావు గారు ఇతర భాషల పాఠకులకు కూడా సుపరిచితులయ్యారు. ప్రసిద్ధ సృజనాత్మక రచయితగా కాంతారావు గారికి 'దగాపడిన తమ్ముడు' నవల ఎంతో గుర్తింపు తెచ్చింది. ఈ నవల నేషనల్ బుక్ ట్రస్ట్ వారిచే అన్ని భారతీయ భాషల్లో ప్రచురింపబడింది. వీరి 'పుణ్యభూమి' నవలకు 1972 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 'వంశధార' నవలకు 1986 లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించాయి. 1988 లో గోపీచంద్ అవార్డు, 1996 లో మద్రాస్ కళాసాగర్ వారి విశిష్ఠ పురస్కారం, రావిశాస్త్రి స్మారక పురస్కారం, 1998 లో 'బలివాడ కాంతారావు రచనలపై ఎందరో విద్యార్థులు పరిశోధనలు చేసి ఎం ఫిల్, పిహెచ్ డి డిగ్రీలు సంపాదించారు. యువ విద్యార్థులు, పెద్దలు, కథలు రాస్తున్నవారు, రాయాలనుకునేవారు తప్పక చదవాల్సిన ఆణిముత్యాల్లాంటి 138 కథల కలశం!© 2017,www.logili.com All Rights Reserved.