నా చిన్నప్పుడు మా ఉరిదేవాలయంలోను, వీధి మొగదలల్లోను హరికథలు, పురాణ కాలక్షేపాలు జరుగుతుండేవి. ఇరవై రోజులు, నెల్లాళ్లు, ఒక్కోసారైతే మండలం రోజులు జరిగేవవి. రామాయణ భారత భాగవతాలు, అష్టాదశ పురాణాలు స్వయంగా చదివి స్వారస్వాన్ని గ్రహించలేని పామరజనానికి జనరంజకంగా చెప్పి మళ్ళీ జీవితంలో మర్చిపోలేనంత కమ్మగా గుర్తుండేలా చేసేవారు హరిదాసులు, పురాణ పండితులు.
'గాంధీ గారు చెప్పిన బేసిక్ ఎడ్యుకేషన్ అనేది వేరు కావచ్చు కాని, మనదేశంలో గ్రామాల్లో ఈ హరికథలు, పురాణాలు ఒక గొప్ప బేసిక్ ఎడ్యుకేషన్ గా తరతరాలుగా పనిచేస్తూ వచ్చాయి. సినిమా సంస్కృతి వచ్చి అన్నిటినీ పూర్తిగా తుడిచి పెట్టేసింది. అందుకుతోడు ఇప్పుడు సినిమా సంస్కృతితోపాటు ఇంగ్లీషు విద్యావ్యామోహం ప్రబలి కాన్వెంటు చదువులు దేశమంతా అల్లుకున్నాక ఏ ఇంట్లోనూ చేత వెన్నముద్ద లేదు, చెంగల్వపూదండ లేదు, దసరా పద్యాల్లేవు.
- ప్రయాగ రామకృష్ణ