ఈ పుస్తకంలో మొత్తం 27 కథలు కలవు. ఈ కథలు అన్నీ చదివిస్తాయి. కొన్ని ఆపి ఆలోచింపజేస్తాయి. పునాసపంతులు కథ సత్యం శంకరమంచి అమరావతి కథల్లో పాత్రని తలపుకి తెస్తుంది. కళ్ళు చెమరుస్తాయి. 'వరాలు' అన్న కథలో భగవంతుడు మనిషికి నిద్ర, మరపు, ఆశ, మృత్యువు అనే నాలుగు వరాలు ఇచ్చాడు అని చెబుతూ, ఇవి ఎంత గొప్పవారాలో మానని ఆలోచించమంటారు.
'కలం' కథలో నేటివిటీకి.. ఆ పాత్రతో చాలామంది ఐడెంటిఫై అయిపోతారు. 'ప్రాప్తమున్న తీరానికి' కథలో సంసారికి, దీపంకింద నీడల్లాంటి నిజాలు.. న్యూమరాలజీ తెలిసి భర్తకు ఒంటరితనం అలవాటు చెయ్యాలి, తప్పనిసరి అనుకున్న ఒక గొప్ప ఇల్లాలు కంటతడి పెట్టిస్తుంది. అంతేగాక కథలో రచయిత ఆడదాన్ని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారా! అనిపిస్తుంది. మూకుమ్మడి అత్యాచారానికి గురైన ఆడదాని కథ హృద్యమంగా చెప్తారు గోత్రం కథలో.
వంటలు, రుచులు.. వీటితో చాలా కథలు నోరూరిస్తాయి. హాస్యకథలు, శృంగారకథలు, అల్లరికథలు, ఆలోచింపజేసే కథలు.. పాఠకులకి విందుభోజనం లాంటిది ఈ కథాసంపుటి. ఈ అక్షరాల అద్భుతంలో నరక సదృశ్యమైన బాధను మరచిపోగలిగిన చిరంజీవి భువనచంద్రగారికి నూరేళ్ళ మనుగడ అమ్మవారి అక్షర శాసనం. అది తప్పదు.
- శ్రీమతి జలంధర చంద్రమోహన్
ఈ పుస్తకంలో మొత్తం 27 కథలు కలవు. ఈ కథలు అన్నీ చదివిస్తాయి. కొన్ని ఆపి ఆలోచింపజేస్తాయి. పునాసపంతులు కథ సత్యం శంకరమంచి అమరావతి కథల్లో పాత్రని తలపుకి తెస్తుంది. కళ్ళు చెమరుస్తాయి. 'వరాలు' అన్న కథలో భగవంతుడు మనిషికి నిద్ర, మరపు, ఆశ, మృత్యువు అనే నాలుగు వరాలు ఇచ్చాడు అని చెబుతూ, ఇవి ఎంత గొప్పవారాలో మానని ఆలోచించమంటారు. 'కలం' కథలో నేటివిటీకి.. ఆ పాత్రతో చాలామంది ఐడెంటిఫై అయిపోతారు. 'ప్రాప్తమున్న తీరానికి' కథలో సంసారికి, దీపంకింద నీడల్లాంటి నిజాలు.. న్యూమరాలజీ తెలిసి భర్తకు ఒంటరితనం అలవాటు చెయ్యాలి, తప్పనిసరి అనుకున్న ఒక గొప్ప ఇల్లాలు కంటతడి పెట్టిస్తుంది. అంతేగాక కథలో రచయిత ఆడదాన్ని ఎంత గొప్పగా అర్థం చేసుకున్నారా! అనిపిస్తుంది. మూకుమ్మడి అత్యాచారానికి గురైన ఆడదాని కథ హృద్యమంగా చెప్తారు గోత్రం కథలో. వంటలు, రుచులు.. వీటితో చాలా కథలు నోరూరిస్తాయి. హాస్యకథలు, శృంగారకథలు, అల్లరికథలు, ఆలోచింపజేసే కథలు.. పాఠకులకి విందుభోజనం లాంటిది ఈ కథాసంపుటి. ఈ అక్షరాల అద్భుతంలో నరక సదృశ్యమైన బాధను మరచిపోగలిగిన చిరంజీవి భువనచంద్రగారికి నూరేళ్ళ మనుగడ అమ్మవారి అక్షర శాసనం. అది తప్పదు. - శ్రీమతి జలంధర చంద్రమోహన్© 2017,www.logili.com All Rights Reserved.