విశాఖ సెయింట్ జోసఫ్ కళాశాలో చదువు సాగిస్తున్న తరుణంలోనే నాలో అంతర్గతంగా పరిశీలనాశక్తి మొగ్గు తొడిగింది. బాల్యంలో కేవలం జెరాక్స్ కాపీలా బుర్రలో ముద్రితమయ విషయాలు వయసు, ఊహ, పరిశీలనాశక్తి పెరిగే కొలది విశ్లేషణ, విమర్శ, వివరణలై నా సంభాషణలో చోటు చేసుకో నారంభించాయి. ఈ మార్పు కేవలం నా కుటుంబసంభ్యులు, స్నేహితులకే పరిమితం కాకా నేను చదివే రచనపట్ల కూడా కలుగసాగింది. అయితే నా భావాలను ప్రోది చేసుకుని మనసులోనే నిలువరించుకుంటున్న నాకు వాటిని వెలువరించే అవకాశం తొలిసారిగా ఆంధ్రప్రభలో కలిగింది.
స్పందనే రచనకు శ్రీకారం. స్పందన సంభాషణలలో నలుగురికి చేరితే రచన ద్వారా పదుగురికి చేరుతుంది. భావజాల ప్రకటనకు రచనకు మించిన మాధ్యమం లేదనిపించింది. అయితే ఆలోచనకు అంకురార్పణ జరిగినంత శీఘ్రంగా ఆచరణ వేగం పుంచుకోడు.
-సి.ఉమాదేవి.