మాట మనిషికి భగవంతుడిచ్చిన వరం. టివి చెవినిల్లు కట్టుకుని మాటలు, పాటలు వినిపించినా మన మనుసులోని మాట ఎవరితోనైనా పంచుకోకపోతే ఎంత వేదన? ఎంత నరకం? పాఠకలోకాన్ని అమితంగా స్పందింపచేసిన కథ. "రేపు పదవి విరమణ తర్వాత మా పరిస్థితి ఇంతేనా?" అని ఆందోళనగా అడిగిన పెద్దలు కొందరైతే, " ఇది మా జీవనవేదనకు సామీప్యత గల కథ" అంటూ తమ మనసులోని బాధను పంచుకున్న వృద్దులు మరికొందరు. సమాజ ముఖచిత్రానికి అద్దం ఈ 'మాటేమంత్రము' కథ....
కన్నబిడ్డ పుట్టినరోజునాడు కనీసం శుభాకాంక్షలు చెప్పే తీరిక లేని బిజీ బిజీ తండ్రులున్న నేటి రోజుల్లో 'నాన్న నీకేం కావాలి?' అని అమాయకంగా అడిగే చిన్నారి కథ.
స్నేహితుడి జ్ఞాపకాలను ఆర్తిగా తడిమిన 'జ్ఞాపిక' కథ. పెద్దరికం నోటికి తాళం వేసుకుంటే ఇక ఆ ఇంట్లో సంభవించే మార్పులను చూపే కథ 'మౌనమే నీ భాష.'
వార్థక్యం మరో పసితనమే అని చెప్పే కథ 'పునరపి బాల్యం' మానవీయ కొణాలేన్నిటినో చవి చూపే మరిన్ని కథలు ఈ పుస్తకంలో మిమ్మల్ని పలికరిస్తాయి.
-సి. ఉమాదేవి.
మాట మనిషికి భగవంతుడిచ్చిన వరం. టివి చెవినిల్లు కట్టుకుని మాటలు, పాటలు వినిపించినా మన మనుసులోని మాట ఎవరితోనైనా పంచుకోకపోతే ఎంత వేదన? ఎంత నరకం? పాఠకలోకాన్ని అమితంగా స్పందింపచేసిన కథ. "రేపు పదవి విరమణ తర్వాత మా పరిస్థితి ఇంతేనా?" అని ఆందోళనగా అడిగిన పెద్దలు కొందరైతే, " ఇది మా జీవనవేదనకు సామీప్యత గల కథ" అంటూ తమ మనసులోని బాధను పంచుకున్న వృద్దులు మరికొందరు. సమాజ ముఖచిత్రానికి అద్దం ఈ 'మాటేమంత్రము' కథ.... కన్నబిడ్డ పుట్టినరోజునాడు కనీసం శుభాకాంక్షలు చెప్పే తీరిక లేని బిజీ బిజీ తండ్రులున్న నేటి రోజుల్లో 'నాన్న నీకేం కావాలి?' అని అమాయకంగా అడిగే చిన్నారి కథ. స్నేహితుడి జ్ఞాపకాలను ఆర్తిగా తడిమిన 'జ్ఞాపిక' కథ. పెద్దరికం నోటికి తాళం వేసుకుంటే ఇక ఆ ఇంట్లో సంభవించే మార్పులను చూపే కథ 'మౌనమే నీ భాష.' వార్థక్యం మరో పసితనమే అని చెప్పే కథ 'పునరపి బాల్యం' మానవీయ కొణాలేన్నిటినో చవి చూపే మరిన్ని కథలు ఈ పుస్తకంలో మిమ్మల్ని పలికరిస్తాయి. -సి. ఉమాదేవి.© 2017,www.logili.com All Rights Reserved.