అక్షరాన్ని ఆర్తిగా అల్లుకోవాలనే తపన విభిన్న పుస్తకాలను చదివించే అవకాశమిచ్చింది. కలం గొప్పదాని చిన్ననాటనే విన్న ప్రసంగ పాఠలు మనసుకు ముద్రితమై కనబడిన ప్రతి పుస్తకం నాకు చేరువైంది. పుస్తకం చదవడం, ఆ తరువాత మరచిపోవడం కాక చదివిన ప్రతి పుస్తకం మస్తిష్కంలో అక్షరకెరటాలను కదుపుతునే ఉండటంతో నా మనసులో విశ్లేషణ ప్రారంబమైంది. ఆ విశ్లేషణలు సమీక్షలుగా మీ ముందుకు తీసుకుని వచ్చాను.
ప్రతి రచయత, రచయిత్రి, కవి తమదైన శైలిలో భావప్రకటనకు పుస్తకరూపమిస్తున్నారు. ఏ రచనయినా చదివినపుడు అందులో నిబిడీ కృతమైన అంతర్భావం ద్వారా మన ఆలోచనలకు తొలిబీజం వేస్తుంది. ఆ అక్షరకెళీ మనసును పడే పడే వెంటాడుతుంది. పుస్తకం ఏమి చెప్తోంది, ఎందుకు చెప్తోoది, ఏలా చెప్తోంది అనే ప్రశ్నలకు సమాధానమే నా సమీక్షా మాలిక.
-సి.ఉమాదేవి.