జైన పురాణాల్లో అతి ముచ్చటైన కథ ఒకటున్నది. మొత్తం ప్రపంచానికి అధిపతి అయిన వాణ్ణి చక్రవర్తి అనే వీలుంటుంది. 'చక్ర'మంటే మనందరికీ తెలిసిన చక్రం; వర్తించడమంటే, తిరిగి రావడం. అనవసరమైన యుద్ధాలు, తద్వారా జనించే సంహారాలు లేకుండా ప్రాచీన భారతంలో ఈ చక్రాన్ని వర్తింపజేయడం అనే పద్ధతి నవలంబించేవారు. ఓ బంగారు రథాన్ని మేలుజాతి అశ్వాలకు కట్టేవారు. ఆ రథం ఒక దేశం నుండి బయలుదేరి మరో దేశానికి వెళ్తుండేది. అవతలి దేశం వారు దీనిని అడ్డుకోకుండా, దాని దారిన దానిని పోనిస్తే. ఈ రథమూ దాని చోధకులూ, ఏ రాజ్యానికి చెంది ఉన్నారో ఆ రాజు యొక్క ఆధిపత్యం ఇవతలి రాజ్యాల వారు స్వీకరించినట్లు లెక్క. పోట్లాటే లేదు.
అలా ఎన్ని దేశాల్లో ఆ రథం తిరిగి వస్తే అంత మేరకి అన్ని దేశాలకు ఆ రాజు చక్రవర్తి. ఆ రథాన్ని అడ్డుకోదలచినవాడు అవతలి రాజు బలాన్ని గుర్తెరిగి అడ్డుకోవలసి వుంటుంది. సరితూగ గలవాడే అడ్డుకుంటాడుగానీ, ఎవరుపడితే వారు అడ్డుకోజాలరు. మూర్ఖంగా ప్రవర్తిస్తే ఆ రాజు తన సైన్య సంహారం, ఘోర పరాజయానికి సిద్ధ పడవలసి ఉంటుంది.
జైన పురాణాల్లో అతి ముచ్చటైన కథ ఒకటున్నది. మొత్తం ప్రపంచానికి అధిపతి అయిన వాణ్ణి చక్రవర్తి అనే వీలుంటుంది. 'చక్ర'మంటే మనందరికీ తెలిసిన చక్రం; వర్తించడమంటే, తిరిగి రావడం. అనవసరమైన యుద్ధాలు, తద్వారా జనించే సంహారాలు లేకుండా ప్రాచీన భారతంలో ఈ చక్రాన్ని వర్తింపజేయడం అనే పద్ధతి నవలంబించేవారు. ఓ బంగారు రథాన్ని మేలుజాతి అశ్వాలకు కట్టేవారు. ఆ రథం ఒక దేశం నుండి బయలుదేరి మరో దేశానికి వెళ్తుండేది. అవతలి దేశం వారు దీనిని అడ్డుకోకుండా, దాని దారిన దానిని పోనిస్తే. ఈ రథమూ దాని చోధకులూ, ఏ రాజ్యానికి చెంది ఉన్నారో ఆ రాజు యొక్క ఆధిపత్యం ఇవతలి రాజ్యాల వారు స్వీకరించినట్లు లెక్క. పోట్లాటే లేదు. అలా ఎన్ని దేశాల్లో ఆ రథం తిరిగి వస్తే అంత మేరకి అన్ని దేశాలకు ఆ రాజు చక్రవర్తి. ఆ రథాన్ని అడ్డుకోదలచినవాడు అవతలి రాజు బలాన్ని గుర్తెరిగి అడ్డుకోవలసి వుంటుంది. సరితూగ గలవాడే అడ్డుకుంటాడుగానీ, ఎవరుపడితే వారు అడ్డుకోజాలరు. మూర్ఖంగా ప్రవర్తిస్తే ఆ రాజు తన సైన్య సంహారం, ఘోర పరాజయానికి సిద్ధ పడవలసి ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.