అది ఒక మేడ, అట్లాంటి మేడ ఇంకెక్కడా చూసినట్టు నాకు జ్ఞాపకం లేదు. అది ఒక దుర్భేద్యమైన కోటలా ఆకాశంలోకి తొంగిచూస్తూ ఉంటుంది. దాని ఉన్నత శిఖరాలు చుక్కలతో మాట్లాడుతూ ఉంటాయి. అది రాత్రింబవళ్ళు ఒక విచిత్రమైన కాంతితో మెరుస్తూ ఉంటుంది. అసలా మేడ దేనితో కట్టారో చెప్పడం కష్టం. అది మామూలు ఇటుక సున్నంతో కట్టింది మాత్రం కాదు. ఇటుక సున్నంతో కట్టినవి అలా మెరవవు. బహుశా అది ఇనుము, రాగి మొదలైన లోహాలన్నీ కలబోసి కట్టబడి ఉంటుంది. దానిని కట్టారనటం కూడా పొరబాటే. పోతబోసి ఉంటారు. కాని ఎవరు పోతబోశారు? ఎప్పుడు చేశారనేది చెప్పడం కష్టం. నాకు ఊహవచ్చిన దగ్గర్నించి ఆ మేడ అలాగే ఉంది. నా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు కూడా వారికి అలాగే చెప్పారు. నిజం చెప్పాలంటే ఆ మేడ అనాది కాలం నుండీ అలాగే నిలబడి ఉంది. అదే ఈ దివ్య భవనం.
అది ఒక మేడ, అట్లాంటి మేడ ఇంకెక్కడా చూసినట్టు నాకు జ్ఞాపకం లేదు. అది ఒక దుర్భేద్యమైన కోటలా ఆకాశంలోకి తొంగిచూస్తూ ఉంటుంది. దాని ఉన్నత శిఖరాలు చుక్కలతో మాట్లాడుతూ ఉంటాయి. అది రాత్రింబవళ్ళు ఒక విచిత్రమైన కాంతితో మెరుస్తూ ఉంటుంది. అసలా మేడ దేనితో కట్టారో చెప్పడం కష్టం. అది మామూలు ఇటుక సున్నంతో కట్టింది మాత్రం కాదు. ఇటుక సున్నంతో కట్టినవి అలా మెరవవు. బహుశా అది ఇనుము, రాగి మొదలైన లోహాలన్నీ కలబోసి కట్టబడి ఉంటుంది. దానిని కట్టారనటం కూడా పొరబాటే. పోతబోసి ఉంటారు. కాని ఎవరు పోతబోశారు? ఎప్పుడు చేశారనేది చెప్పడం కష్టం. నాకు ఊహవచ్చిన దగ్గర్నించి ఆ మేడ అలాగే ఉంది. నా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు కూడా వారికి అలాగే చెప్పారు. నిజం చెప్పాలంటే ఆ మేడ అనాది కాలం నుండీ అలాగే నిలబడి ఉంది. అదే ఈ దివ్య భవనం.© 2017,www.logili.com All Rights Reserved.