ఫెయోదార్ మిఖలోవిచ్ దొస్తాయేప్ స్కీ (11 నవంబర్ 1821 - 9 ఫిబ్రవరి 1881) పీటర్స్ బర్గ్ (అప్పటి రష్యా రాజధాని)లో ఓ మధ్యతరగతి డాక్టర్ కుటుంబంలో జన్మించాడు. యవ్వనంలో ఇంజినీరింగ్ చదువుతున్న సందర్భంలో విప్లవ భావాలతోప్రేరేపితమయ్యాడు. డిశంబరిష్ట తిరుబాటు (1825 - డిసెంబర్) ఆనాటి రష్యాలోని మధ్యతరగతి, యూనివర్శిటీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ స్ఫూర్తితో ఓ యువ తాత్విక చర్చా సంఘంలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. "పేద జనం” అతని మొదటి రచన. అది సాహిత్య ప్రపంచంలో మంచి పేరు తెచ్చింది. ఈ పుస్తకం జారిప్ట్ రష్యాలో పేదల పాట్లను వివరించింది. దీనితో ప్రభుత్వం ఇతని రచనలపై నిషేధం విధించి, తిరుగుబాట్ల సమర్థకుడనే అభియోగం మోపి ఉరిశిక్ష విధించింది. పీటర్స్ బర్గ్ జైలులో వుంచారు. తరువాత జరిగిన విచారణ వల్ల చివరి క్షణంలో, సైబీరియన్ ప్రవాసానికి పంపించారు. తిరిగి వచ్చిన తరువాత వ్రాసిన కరమజోవ్ సోదరులు, నేరము - శిక్ష, శ్వేత రాత్రులు, ఈడియట్ వంటి రచనలు ప్రజల మన్ననలు పొందాయి. మానసిక విశ్లేషణలతో కూడిన వాస్తవవాద దృక్పథాన్ని అనుసరించడం వల్ల ఆయన సాహిత్యం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.
ఫెయోదార్ మిఖలోవిచ్ దొస్తాయేప్ స్కీ (11 నవంబర్ 1821 - 9 ఫిబ్రవరి 1881) పీటర్స్ బర్గ్ (అప్పటి రష్యా రాజధాని)లో ఓ మధ్యతరగతి డాక్టర్ కుటుంబంలో జన్మించాడు. యవ్వనంలో ఇంజినీరింగ్ చదువుతున్న సందర్భంలో విప్లవ భావాలతోప్రేరేపితమయ్యాడు. డిశంబరిష్ట తిరుబాటు (1825 - డిసెంబర్) ఆనాటి రష్యాలోని మధ్యతరగతి, యూనివర్శిటీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ స్ఫూర్తితో ఓ యువ తాత్విక చర్చా సంఘంలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. "పేద జనం” అతని మొదటి రచన. అది సాహిత్య ప్రపంచంలో మంచి పేరు తెచ్చింది. ఈ పుస్తకం జారిప్ట్ రష్యాలో పేదల పాట్లను వివరించింది. దీనితో ప్రభుత్వం ఇతని రచనలపై నిషేధం విధించి, తిరుగుబాట్ల సమర్థకుడనే అభియోగం మోపి ఉరిశిక్ష విధించింది. పీటర్స్ బర్గ్ జైలులో వుంచారు. తరువాత జరిగిన విచారణ వల్ల చివరి క్షణంలో, సైబీరియన్ ప్రవాసానికి పంపించారు. తిరిగి వచ్చిన తరువాత వ్రాసిన కరమజోవ్ సోదరులు, నేరము - శిక్ష, శ్వేత రాత్రులు, ఈడియట్ వంటి రచనలు ప్రజల మన్ననలు పొందాయి. మానసిక విశ్లేషణలతో కూడిన వాస్తవవాద దృక్పథాన్ని అనుసరించడం వల్ల ఆయన సాహిత్యం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.© 2017,www.logili.com All Rights Reserved.