రాత్రి పడుకునేటప్పుడు చందమామను చూపించి పిల్లలకు కథలు చెప్పే తల్లులు ఇప్పటికీ ఉన్నారు. ప్రత్యక్షంగా చెప్పకపోయినా యూట్యూబ్ లో కానీ, వెబ్ సైట్లలో కానీ తల్లులు పిల్లలకు వాటిని చూపిస్తుంటే వాటిపై మక్కువ చూపించని పిల్లలు ఉండరు గాక ఉండరు. అలా పిల్లల వయసుతో పాటే వారిలో కథల మీద ఆసక్తి కూడా పెరుగుతూ వస్తుంది. ఏ వయసుకి ఆ ముచ్చట అన్నట్లు ఏ వయసులో వారు వారికి తగ్గ కథలను ఎంచుకుని చదువుకుంటారు. ఎప్పటికైనా కూడా పుస్తకం ఒక మంచి మిత్రునిలాగా ఉంటుంది కనుక ఇప్పటికీ పుస్తక పఠనం వైపే చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. అందుకే మంచి కథ ఏదైనా చదివితే వెంటనే దానిని ఫేస్బుక్ లోనూ, వాట్సాప్ లోనూ మిత్రులందరికీ పంపించి, వారి ఆనందాన్ని సాటివారితో పంచుకుంటున్నారు. అందుకే నేను వ్రాసిన కథల్లో ఆణిముత్యాల్లాంటి కథలు యేరి మీకోసం ఈ పుస్తకం తీసుకువచ్చాను.
- జి. యస్. లక్ష్మి