ఈ సంకలనంలో మొత్తం 50 కథలున్నాయి. ఆవిడ పరిశీలించిన ప్రతి అంశాన్ని కథగా తీర్చిదిద్దారు. కథలో పాత్రలతో పాటు పాఠకులను కూడా నడిపించగల అద్వితీయమైన నేర్పు ఆమెకున్నది. కొన్ని కథలను స్పృశించి హేమగారి నిపుణతను చూద్దాం. 'వానా వానా వల్లప్ప' కథలో రైతుల జీవన పరిస్థితులను కళ్ళముందుంచారు. 'గంగిగోవు' కథలో తాను పెంచుకున్న గోవు గంగ పట్ల సుభద్రమ్మ పెంచుకున్న అనుబంధం, మమకారం, చివరికి ఆ ఆవు ఆకలితో అలమటించి చెత్త ప్లాస్టిక్ బ్యాగులు తిని చనిపోవడం అనేది కథ. 'ప్రేమాతీతం' కథలో తండ్రి జగన్నాథం కూతురు అపర్ణ ప్రేమ వ్యవహారంలో ఎంతో ఓపికగా కూతురితో మాట్లాడటం వ్యక్తిత్వ వికాసం నిపుణుడు ఆ సందర్భంలో సంయమనంతో నిలిచి మాట్లాడుతున్నట్లుంటుంది. ఇలా ఒకొక్క కథలో ఒకొక్క కొత్త అంశాన్ని గురించి హేమగారు తెలియజేశారు.
ఈ సంకలనంలో మొత్తం 50 కథలున్నాయి. ఆవిడ పరిశీలించిన ప్రతి అంశాన్ని కథగా తీర్చిదిద్దారు. కథలో పాత్రలతో పాటు పాఠకులను కూడా నడిపించగల అద్వితీయమైన నేర్పు ఆమెకున్నది. కొన్ని కథలను స్పృశించి హేమగారి నిపుణతను చూద్దాం. 'వానా వానా వల్లప్ప' కథలో రైతుల జీవన పరిస్థితులను కళ్ళముందుంచారు. 'గంగిగోవు' కథలో తాను పెంచుకున్న గోవు గంగ పట్ల సుభద్రమ్మ పెంచుకున్న అనుబంధం, మమకారం, చివరికి ఆ ఆవు ఆకలితో అలమటించి చెత్త ప్లాస్టిక్ బ్యాగులు తిని చనిపోవడం అనేది కథ. 'ప్రేమాతీతం' కథలో తండ్రి జగన్నాథం కూతురు అపర్ణ ప్రేమ వ్యవహారంలో ఎంతో ఓపికగా కూతురితో మాట్లాడటం వ్యక్తిత్వ వికాసం నిపుణుడు ఆ సందర్భంలో సంయమనంతో నిలిచి మాట్లాడుతున్నట్లుంటుంది. ఇలా ఒకొక్క కథలో ఒకొక్క కొత్త అంశాన్ని గురించి హేమగారు తెలియజేశారు.© 2017,www.logili.com All Rights Reserved.