నిర్దిష్ట స్థల కాలాదుల్ని కేంద్రంగా చేసుకొని వచ్చిన కథానికల సమాహారం 'యానాం కథలు'. కవిగా ప్రసిద్ధి చెందిన దాట్ల దేవదానం రాజు కథకునిగా చూపిన పరిణితికి నిదర్శనం ఈ కథలు. యానాం ప్రాంత భౌగోళిక పరిసరాలతో చరిత్రతో ముడిపడిన ప్రజల జీవన పోరాటాల్నీ, భావోద్వేగాల్నీ రచయిత ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు. గ్లోబలైజేషన్ క్రమాన స్థానికతకు ప్రాధాన్యం చేకూరింది. స్థానిక చరిత్రల అధ్యయనానికి సాహిత్యం ఉపకరణమయింది. ఈ దృష్ట్యా తెలుగు కథాసాహిత్యంలో యానాం కథలది విశిష్ట స్థానం.
ఈ కథలన్నీ కలిసి దాదాపు 150 ఏళ్ల యానాం ప్రాంత సామాజిక పరిణామాలను ప్రతిబింబిస్తాయి. బాల్య వివాహాలు మొదలు ఇచ్చిక వివాహాల దాకా, త్యాగం మొదలు స్వార్ధం దాకా, సహనం నుండి తిరుగుబాటు దాకా ఈ కథలలోని పాత్రలు ప్రయాణం చేస్తాయి. బ్రిటిష్ ఆంధ్రలోని చట్టాల నియమాల నుండి తప్పించుకోడానికి ప్రజలు యానాంలోకి రావడం ఆసక్తి కరమైన విషయం. అలాగే స్వేచ్చ సమానత్వం సౌభ్రాతృత్వం అనే మహత్తర సిద్ధాంతాలు పుట్టిన దేశం మనిషే యానాంను శాశ్వతంగా వలసగా మార్చుకొనే కుట్ర చేయడం కూడా ఆశ్చర్యం గొలిపే అంశం.
నిర్దిష్ట స్థల కాలాదుల్ని కేంద్రంగా చేసుకొని వచ్చిన కథానికల సమాహారం 'యానాం కథలు'. కవిగా ప్రసిద్ధి చెందిన దాట్ల దేవదానం రాజు కథకునిగా చూపిన పరిణితికి నిదర్శనం ఈ కథలు. యానాం ప్రాంత భౌగోళిక పరిసరాలతో చరిత్రతో ముడిపడిన ప్రజల జీవన పోరాటాల్నీ, భావోద్వేగాల్నీ రచయిత ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు. గ్లోబలైజేషన్ క్రమాన స్థానికతకు ప్రాధాన్యం చేకూరింది. స్థానిక చరిత్రల అధ్యయనానికి సాహిత్యం ఉపకరణమయింది. ఈ దృష్ట్యా తెలుగు కథాసాహిత్యంలో యానాం కథలది విశిష్ట స్థానం. ఈ కథలన్నీ కలిసి దాదాపు 150 ఏళ్ల యానాం ప్రాంత సామాజిక పరిణామాలను ప్రతిబింబిస్తాయి. బాల్య వివాహాలు మొదలు ఇచ్చిక వివాహాల దాకా, త్యాగం మొదలు స్వార్ధం దాకా, సహనం నుండి తిరుగుబాటు దాకా ఈ కథలలోని పాత్రలు ప్రయాణం చేస్తాయి. బ్రిటిష్ ఆంధ్రలోని చట్టాల నియమాల నుండి తప్పించుకోడానికి ప్రజలు యానాంలోకి రావడం ఆసక్తి కరమైన విషయం. అలాగే స్వేచ్చ సమానత్వం సౌభ్రాతృత్వం అనే మహత్తర సిద్ధాంతాలు పుట్టిన దేశం మనిషే యానాంను శాశ్వతంగా వలసగా మార్చుకొనే కుట్ర చేయడం కూడా ఆశ్చర్యం గొలిపే అంశం.© 2017,www.logili.com All Rights Reserved.