ఒక కథ చదివి బాగుంది అనుకుంటాం. ఎందుకు బాగుందీ అనుకున్నప్పుడే కొంచెం ఆలోచించాలి. కథనం బాగుందా? వస్తువు బాగుందా? భాష బాగుందా? భాష ఎవరికి బాగుంది? వస్తువు ఎప్పుడు ఎందుకు బాగుంటుంది? అందరికి ఒకేలా బాగుంటుందా? కథ బాగుండడానికి ఖచ్చితమైన ప్రమాణాలున్నాయా? చట్రాలున్నాయా? అది అందులోనే ఇమడాలా? ఇన్ని దృష్టిలో పెట్టుకుని వ్రాసుకుంటూపొతే అది మంచి కథ అవుతుందా? అప్పుడా కథలో సద్యస్పూర్తి ఉంటుందా? ఇట్లా అనేక ప్రశ్నలు ముసురుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధ రచయిత ఇలా రాయమన్నాడు/అన్నది ఇలా వ్రాసారు అనో దానిని అనుసరిస్తూనో అనుకరిస్తూనో మనం వ్రాసేస్తే అది మంచి కథ అవుతుందా? వారు చెప్పినప్పటి కాలమూ, ఆలోచనలూ ఇప్పుడింకా ఉన్నాయా?
అవే విశ్వజనీన సూత్రాలా? ఒక రచయిత ఒక మూసశిల్పం ఒక మూస ఆలోచన పెట్టుకుని దానికి అతుక్కుపోవడమే పద్ధతా? అని కూడా ప్రశ్నలు పుడతాయి. నా ప్రశ్నలకు జార్జ్ శ్యాండర్స్ చెప్పిన సమాధానం నాకు నచ్చింది. ఆయనన్నాడు, ఒక కథ చదివినప్పుడు మనలో కొత్త ఎరుక ఎదో కాస్త కలగాలి, ప్రపంచం మీద కాస్త ప్రేమ కలగాలి. కనీసం ఆరుశాతం అయినా ప్రపంచజ్ఞానం పెరగాలి అని. మన బాలగోపాల్ కూడా చెప్పాడు కదా ఖాళీలు పూరించాలని. నేనూ అదే నమ్ముతాను. నేని ఇంకొకటి కూడా నమ్ముతాను. రచయితలు తీర్పరులు కాకూడదు. పాఠకులే ఎవరెవరి చైతన్యాన్నిబట్టి వారి తీర్పులు ఇచ్చుకోవాలి.
రచయితకి స్వతంత్రం ఉండాలి. తనదైన శైలి ఉండాలి. ప్రయోగాలు చెయ్యాలి. అయితే కథలో సమకాలీనత, పఠనీయత ఉండాలి. ప్రవాహశీలత, కొంత తాత్వికత తప్పకుండా ఉండాలి. రచనాకాలంనాటి సామాజిక ప్రరిస్థితి తెలియాలి. ఒక దృక్పథం ఉండాలి. అ దృష్టితో చూసినప్పుడు ఈ సంకలనంలో గత కొద్ది సంవత్సరాలుగా సమాజంలో వచ్చిన మార్పులు, మానవ సంబంధాలకూ నాగరికతకూ జీవిత ఆశయాలకూ అభివృద్ధికీ ఇచ్చుకునే నిర్వచనాలు మారిపోయిన క్రమం కళ్ళ ముందుకు తెచ్చే కథలున్నాయి.
ఒక కథ చదివి బాగుంది అనుకుంటాం. ఎందుకు బాగుందీ అనుకున్నప్పుడే కొంచెం ఆలోచించాలి. కథనం బాగుందా? వస్తువు బాగుందా? భాష బాగుందా? భాష ఎవరికి బాగుంది? వస్తువు ఎప్పుడు ఎందుకు బాగుంటుంది? అందరికి ఒకేలా బాగుంటుందా? కథ బాగుండడానికి ఖచ్చితమైన ప్రమాణాలున్నాయా? చట్రాలున్నాయా? అది అందులోనే ఇమడాలా? ఇన్ని దృష్టిలో పెట్టుకుని వ్రాసుకుంటూపొతే అది మంచి కథ అవుతుందా? అప్పుడా కథలో సద్యస్పూర్తి ఉంటుందా? ఇట్లా అనేక ప్రశ్నలు ముసురుతూ ఉంటాయి. ఒక ప్రసిద్ధ రచయిత ఇలా రాయమన్నాడు/అన్నది ఇలా వ్రాసారు అనో దానిని అనుసరిస్తూనో అనుకరిస్తూనో మనం వ్రాసేస్తే అది మంచి కథ అవుతుందా? వారు చెప్పినప్పటి కాలమూ, ఆలోచనలూ ఇప్పుడింకా ఉన్నాయా? అవే విశ్వజనీన సూత్రాలా? ఒక రచయిత ఒక మూసశిల్పం ఒక మూస ఆలోచన పెట్టుకుని దానికి అతుక్కుపోవడమే పద్ధతా? అని కూడా ప్రశ్నలు పుడతాయి. నా ప్రశ్నలకు జార్జ్ శ్యాండర్స్ చెప్పిన సమాధానం నాకు నచ్చింది. ఆయనన్నాడు, ఒక కథ చదివినప్పుడు మనలో కొత్త ఎరుక ఎదో కాస్త కలగాలి, ప్రపంచం మీద కాస్త ప్రేమ కలగాలి. కనీసం ఆరుశాతం అయినా ప్రపంచజ్ఞానం పెరగాలి అని. మన బాలగోపాల్ కూడా చెప్పాడు కదా ఖాళీలు పూరించాలని. నేనూ అదే నమ్ముతాను. నేని ఇంకొకటి కూడా నమ్ముతాను. రచయితలు తీర్పరులు కాకూడదు. పాఠకులే ఎవరెవరి చైతన్యాన్నిబట్టి వారి తీర్పులు ఇచ్చుకోవాలి. రచయితకి స్వతంత్రం ఉండాలి. తనదైన శైలి ఉండాలి. ప్రయోగాలు చెయ్యాలి. అయితే కథలో సమకాలీనత, పఠనీయత ఉండాలి. ప్రవాహశీలత, కొంత తాత్వికత తప్పకుండా ఉండాలి. రచనాకాలంనాటి సామాజిక ప్రరిస్థితి తెలియాలి. ఒక దృక్పథం ఉండాలి. అ దృష్టితో చూసినప్పుడు ఈ సంకలనంలో గత కొద్ది సంవత్సరాలుగా సమాజంలో వచ్చిన మార్పులు, మానవ సంబంధాలకూ నాగరికతకూ జీవిత ఆశయాలకూ అభివృద్ధికీ ఇచ్చుకునే నిర్వచనాలు మారిపోయిన క్రమం కళ్ళ ముందుకు తెచ్చే కథలున్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.