ఆధునిక కన్నడ సాహిత్య ప్రపంచంలో 'చిన్నకథ' కు విశిష్ట స్థానం ఉంది. ఇతివృత్త వైవిధ్యం, భాషా వైచిత్రి, శిల్పనైపుణ్యం కన్నడ కథలలో కనిపించే ప్రత్యేకత లక్షణం.
ప్రస్తుత కథాసంకలన గ్రంథం 'క్రౌంచపక్షులు' లో వైదేహి గారు రచించిన విభిన్న మనస్తత్త్వాలను, విభిన్న వస్తువులకు సంబంధించిన కథలు మొత్తం 10 ఉన్నాయి. ఈ కథాసంకలనంలో రచయిత్రి సృజనాత్మకత, విశిష్టానుభవం, అభివ్యక్తి వెల్లడవుతుంది. కథావస్తువులో, రచనా విధానంలో, పాత్ర చిత్రణలో, సన్నివేశ కల్పనలో రచయిత్రి ప్రత్యేకత కన్పిస్తుంది. ఇందులోని కథలు దక్షిణ కన్నడ మాండలికంలో ఉండడం ఒక వైశిష్ట్యం.
కన్నడ రచయిత్రులలో సుప్రసిద్ధులు వైదేహిగారు. వీరు అనేక కథా సంకలనాలను, కవితాసంకలనాలను వెలువరించారు. అనువాదరంగంలో విశేషమైన కృషి చేశారు. వీరి 'క్రౌంచ పక్షిగాళు' కథా సంకలనానికి 2009 లో కేంద్ర సాహిత్య అకాదెమీ పురస్కారం లభించింది. ఆ కథా సంకలన అనువాదమే 'క్రౌంచ పక్షులు'
- జి. ఎస్. మోహన్