తెలుగు సాహిత్యరంగంలో తెలంగాణా భావనను మేధాపరంగా అందిస్తున్న వారిలో ముఖ్యులు ముదిగంటి సుజాతరెడ్డి. నవల, కథారచయిత్రిగా, సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో విదూషీమణిగా ప్రాచీనాంధ్ర సాహిత్యాలపై మంచి అవగాహన కలిగిన పరిశోధకురాలు. అధ్యయనం, అధ్యాపనం, పరిశోధనలు, సృజనలు ఆమె కార్యక్షేత్రాలు. ప్రపంచీకరణ నేపథ్యం, పట్టణ స్వభావంలోని మోసాలు, మారుతున్న హైదరాబాదును మనుషులను శక్తిమంతంగా చిత్రీకరించిన కథలివి.
అంతేగాక నగరీకరణ, స్త్రీ సమస్యలు, భూమి సమస్యలు, భూ వివాదాలు, విలువల పతనాలు, గ్రామీణ పట్టాన ప్రజల మధ్య ఉన్న అంతరాలు, మానవ సంబంధాల ఘర్షణలను, సాంకేతిక అభివృద్ధి మనుషులను దూరం చేస్తున్న తీరును సుజాతరెడ్డి ఈ కథలలో వివరించారు.
సుజాతరెడ్డి కథానికలలో గ్రామీణ భాష, మధ్యతరగతి, అమెరికా తెలుగు కమనీయంగా మనకు వినిపిస్తాయి. సుజాతారెడ్డి కథానికలలో సారళ్యత, సహజత్వంతో పాటు ఆమె అంతరంగం కూడా వినిపిస్తుంది. తనదైన దృక్కోణం, ఆద్యతనదృష్టి ఈ కథానికల నిండా రచయిత్రి ప్రదర్శించారు.
తెలుగు సాహిత్యరంగంలో తెలంగాణా భావనను మేధాపరంగా అందిస్తున్న వారిలో ముఖ్యులు ముదిగంటి సుజాతరెడ్డి. నవల, కథారచయిత్రిగా, సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో విదూషీమణిగా ప్రాచీనాంధ్ర సాహిత్యాలపై మంచి అవగాహన కలిగిన పరిశోధకురాలు. అధ్యయనం, అధ్యాపనం, పరిశోధనలు, సృజనలు ఆమె కార్యక్షేత్రాలు. ప్రపంచీకరణ నేపథ్యం, పట్టణ స్వభావంలోని మోసాలు, మారుతున్న హైదరాబాదును మనుషులను శక్తిమంతంగా చిత్రీకరించిన కథలివి. అంతేగాక నగరీకరణ, స్త్రీ సమస్యలు, భూమి సమస్యలు, భూ వివాదాలు, విలువల పతనాలు, గ్రామీణ పట్టాన ప్రజల మధ్య ఉన్న అంతరాలు, మానవ సంబంధాల ఘర్షణలను, సాంకేతిక అభివృద్ధి మనుషులను దూరం చేస్తున్న తీరును సుజాతరెడ్డి ఈ కథలలో వివరించారు. సుజాతరెడ్డి కథానికలలో గ్రామీణ భాష, మధ్యతరగతి, అమెరికా తెలుగు కమనీయంగా మనకు వినిపిస్తాయి. సుజాతారెడ్డి కథానికలలో సారళ్యత, సహజత్వంతో పాటు ఆమె అంతరంగం కూడా వినిపిస్తుంది. తనదైన దృక్కోణం, ఆద్యతనదృష్టి ఈ కథానికల నిండా రచయిత్రి ప్రదర్శించారు.© 2017,www.logili.com All Rights Reserved.