ప్రముఖ ప్రజాకవి సి.వి. రాసిన "నరబలి" వచన కవితా కావ్యం మెదళ్ళకు పదునుపెట్టే ఆధునిక కావ్యం. మానవతావాదానికి ప్రాణవాయువు. దీనికి ముందుమాట రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కవ్యాలంకార సౌందర్యం గడబిడ లేకుండా స్వాభావిక సౌందర్య కవితా ప్రవాహంగా సాగిన కావ్యమిది. దీన్ని చదువుతుంటే ఇందులోని విషయం అరటిపండోలిచి చేతిలో పెట్టినట్లుగా మనసుకెక్కుతుంది. అయినా రెండుమాటలు చెప్పాలనుకుంటున్నా, చెప్తున్నా...
"నరబలి" కావ్యం తరతరాలుగా కులమత మూఢవిశ్వాస దోపిడీ ఆధిపత్య సంస్కృతి మానవుల మెదళ్ళలో హేతువాద ఆలోచనల విత్తనాలు మొలిపించి సమాజాన్ని సతత హరితంగా ఉంచడానికి ప్రతినిధులుగా ఉండి కృషి చేసిన వాళ్ళను బలితీసుకుంటూ హంతక దర్శకత్వాన్ని నిర్వహిస్తూ వాస్తవాన్ని అక్షరంగా మార్చింది. ఇది ఆధునిక నిసర్గ ఇతిహాసం. నరుడు మనిషిగా, మానవుడుగా, మనీషిగా, మానవతామూర్తిగా మారే వివేచన కిరణాల వెలుతురును ప్రసరించిన ఆధునిక భావ ప్రభాకరం.
ప్రముఖ ప్రజాకవి సి.వి. రాసిన "నరబలి" వచన కవితా కావ్యం మెదళ్ళకు పదునుపెట్టే ఆధునిక కావ్యం. మానవతావాదానికి ప్రాణవాయువు. దీనికి ముందుమాట రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కవ్యాలంకార సౌందర్యం గడబిడ లేకుండా స్వాభావిక సౌందర్య కవితా ప్రవాహంగా సాగిన కావ్యమిది. దీన్ని చదువుతుంటే ఇందులోని విషయం అరటిపండోలిచి చేతిలో పెట్టినట్లుగా మనసుకెక్కుతుంది. అయినా రెండుమాటలు చెప్పాలనుకుంటున్నా, చెప్తున్నా... "నరబలి" కావ్యం తరతరాలుగా కులమత మూఢవిశ్వాస దోపిడీ ఆధిపత్య సంస్కృతి మానవుల మెదళ్ళలో హేతువాద ఆలోచనల విత్తనాలు మొలిపించి సమాజాన్ని సతత హరితంగా ఉంచడానికి ప్రతినిధులుగా ఉండి కృషి చేసిన వాళ్ళను బలితీసుకుంటూ హంతక దర్శకత్వాన్ని నిర్వహిస్తూ వాస్తవాన్ని అక్షరంగా మార్చింది. ఇది ఆధునిక నిసర్గ ఇతిహాసం. నరుడు మనిషిగా, మానవుడుగా, మనీషిగా, మానవతామూర్తిగా మారే వివేచన కిరణాల వెలుతురును ప్రసరించిన ఆధునిక భావ ప్రభాకరం.
© 2017,www.logili.com All Rights Reserved.