ఇవి ప్రధానంగా రాజకీయ కధలు. ప్రతీకాత్మక కధలు. అధిక్షేప కధలు. మన జీవన విధానం ధరించిన రూపాన్నే గాక, దానిలోపలి సారాంశాన్ని కూడా విశ్లేషించడానికి యత్నించిన కధలు. మనం అనుసరిస్తున్న విలువలు సక్రమంగా లేవని, అవి అక్రమంగా వున్నాయని తెలియజేసే కధలు. బహుశా, స్వాతంత్య్రానంతరం కధా సాహితీ రంగంలో మొదటిసారి వెలువడిన రాజకీయ విలువల విలోమ కధలుగా వీటిని పేర్కొనవచ్చు.
ఈ కధలు రాయడానికి నన్ను ప్రేరేపించింది ఎమర్జెన్సీ. 27 సం॥ల క్రితం- 1975 జూన్ 25 అర్ధరాత్రి, ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, ఆమె ప్రియమైన చిన్న కుమారుడు కలిసి, ప్రజల మీద, న్యాయస్థానాల మీద, తదితర వ్యవస్థల మీద కుట్రపన్ని విధించిన క్రూరమైన ఎమర్జెన్సీ. ఈ దేశాన్ని ఒక జైలుగా, నరక కూపంగా మార్చిన అత్యయిక పరిస్థితి.
ఒక అర్ధరాత్రి - 1947 ఆగష్టు 15 అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వొచ్చింది. మరో అర్ధరాత్రి - మన త్యాగధనులు సాధించిన స్వాతంత్య్రానికి మూడు దశాబ్దాలు కూడా నిండక ముందే, 1975 జూన్ 25 అర్ధరాత్రి 12 గం||లకు, ఆ స్వాతంత్య్రం గొంతు నులుముతూ విధించబడింది ఎమర్జెన్సీ.
దేవతలుగా నటించే రాక్షసుల నిజస్వరూపం బయటపడే సందర్భాలు, సన్నివేశాలు, సంఘటనలు అప్పుడప్పుడు చరిత్రలో సంభవిస్తుంటాయి. అటువంటిదే. ఎమర్జెన్సీ కూడా. ప్రజాస్వామ్యం ముసుగులో అప్పటివరకూ సంచరిస్తున్న..............
నరగ్రహణం మొదలైన విలోమ కధలు - నగ్నముని
రెండో ముద్రణ ముందుమాట విలోమ విలువల కధల నేపధ్యం ఇవి ప్రధానంగా రాజకీయ కధలు. ప్రతీకాత్మక కధలు. అధిక్షేప కధలు. మన జీవన విధానం ధరించిన రూపాన్నే గాక, దానిలోపలి సారాంశాన్ని కూడా విశ్లేషించడానికి యత్నించిన కధలు. మనం అనుసరిస్తున్న విలువలు సక్రమంగా లేవని, అవి అక్రమంగా వున్నాయని తెలియజేసే కధలు. బహుశా, స్వాతంత్య్రానంతరం కధా సాహితీ రంగంలో మొదటిసారి వెలువడిన రాజకీయ విలువల విలోమ కధలుగా వీటిని పేర్కొనవచ్చు. ఈ కధలు రాయడానికి నన్ను ప్రేరేపించింది ఎమర్జెన్సీ. 27 సం॥ల క్రితం- 1975 జూన్ 25 అర్ధరాత్రి, ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, ఆమె ప్రియమైన చిన్న కుమారుడు కలిసి, ప్రజల మీద, న్యాయస్థానాల మీద, తదితర వ్యవస్థల మీద కుట్రపన్ని విధించిన క్రూరమైన ఎమర్జెన్సీ. ఈ దేశాన్ని ఒక జైలుగా, నరక కూపంగా మార్చిన అత్యయిక పరిస్థితి. ఒక అర్ధరాత్రి - 1947 ఆగష్టు 15 అర్ధరాత్రి మనకు స్వాతంత్య్రం వొచ్చింది. మరో అర్ధరాత్రి - మన త్యాగధనులు సాధించిన స్వాతంత్య్రానికి మూడు దశాబ్దాలు కూడా నిండక ముందే, 1975 జూన్ 25 అర్ధరాత్రి 12 గం||లకు, ఆ స్వాతంత్య్రం గొంతు నులుముతూ విధించబడింది ఎమర్జెన్సీ. దేవతలుగా నటించే రాక్షసుల నిజస్వరూపం బయటపడే సందర్భాలు, సన్నివేశాలు, సంఘటనలు అప్పుడప్పుడు చరిత్రలో సంభవిస్తుంటాయి. అటువంటిదే. ఎమర్జెన్సీ కూడా. ప్రజాస్వామ్యం ముసుగులో అప్పటివరకూ సంచరిస్తున్న.............. నరగ్రహణం మొదలైన విలోమ కధలు - నగ్నముని© 2017,www.logili.com All Rights Reserved.