న్యాయంగా ఏ కృతైనా దాని కథే భాష్యం. కావ్యం తనంతట తాను వెలువరచలేని అర్థాన్ని ఏ భాషకారుడూ వేలువరచలేదు. కావ్యం సవతసిద్ధం. అయితే నేనీ తొలిపలుకులు ఎందుకు వ్రాస్తున్నట్లు? ఇది పూర్వభాసం కాదు. భాష్యం కాదు. మరి ఏమిటిది? సంజాయిషీ వంటిదా? అసలు సంజాయిషీ అవసరమా? అసలు పేరునుంచి ఎత్తుకుంటాను. గొంతుకలు వస్తున్న నూతిలో నీళ్ళు లేవు. అదొక పాడు నుయ్యి. పాడునుయ్యి పతనానికీ, మరణానికీ సంకేతం. అందులో జీవనం ఉండదు.
అందులో పడి ఉన్న వారికి వెలుగు గోచరించదు. పైకి పాకటానికి ఆధారం కనిపించదు. వారు కేకలు వేస్తారు. కాని వారి గొంతులు బయట వారికి స్పష్టంగా వినిపించవు. భూగర్భపు లోతులు వారిని బాహ్య ప్రపంచం నుంచి వేరు పరుస్తున్నవి. వారు యాత్రికులు కూడా కారు. వారికొక గమ్యం లేదు. చీకటి తప్ప వారికి తోడెవ్వరూ లేరు. వారు గర్వాంధతవల్ల అభిశప్తులైన నహుషులు. కాని ఆ పాపం వారిదే కాదు. అందరిదీ. అది సమస్త మానవకోటికీ వర్తిస్తుంది.
నూతిలో గొంతుకలు సంశయ కావ్యం. దీనిలో మానవుడు ‘ఏది త్రోవ?’ అనే అడుగుతున్నాడు. ‘నాన్యః పథా విద్యతే యనాయ’ అని చెప్పగలిగే స్థితిలో లేడు. చీకటిలో ప్రారంభమైన ఈ కావ్యం ‘ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలను’ చర్చిస్తున్నది. దీనిలోని నాయకులు ‘హేమ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్’ సందిగ్ధావస్తలో ఒక క్రమబద్ధమైన పరిణామాన్ని సూచిస్తున్నారు. హేమ్లెట్ వేదన కర్మపూర్వం. అర్జునుడి వేదన కర్మక్షేత్రంలో తక్షణికం. రాస్కల్నికోవ్ బాధకర్మ తరువాత. అది మానవుని సహజ వేదన. అతణ్ణి త్రికాలాల్లోనూ వెంటాడుతుంది. ఆ బాధలో మధన పడనివాడు పూర్ణత్వాన్ని అందుకోలేడు. ఆ బాధ నుంచి అతను తప్పుకునే మార్గం లేదా – అంటే ఉంది. పలాయనం, కృతకశక్తుల పూజనం. ఆత్మాహననం.
న్యాయంగా ఏ కృతైనా దాని కథే భాష్యం. కావ్యం తనంతట తాను వెలువరచలేని అర్థాన్ని ఏ భాషకారుడూ వేలువరచలేదు. కావ్యం సవతసిద్ధం. అయితే నేనీ తొలిపలుకులు ఎందుకు వ్రాస్తున్నట్లు? ఇది పూర్వభాసం కాదు. భాష్యం కాదు. మరి ఏమిటిది? సంజాయిషీ వంటిదా? అసలు సంజాయిషీ అవసరమా? అసలు పేరునుంచి ఎత్తుకుంటాను. గొంతుకలు వస్తున్న నూతిలో నీళ్ళు లేవు. అదొక పాడు నుయ్యి. పాడునుయ్యి పతనానికీ, మరణానికీ సంకేతం. అందులో జీవనం ఉండదు. అందులో పడి ఉన్న వారికి వెలుగు గోచరించదు. పైకి పాకటానికి ఆధారం కనిపించదు. వారు కేకలు వేస్తారు. కాని వారి గొంతులు బయట వారికి స్పష్టంగా వినిపించవు. భూగర్భపు లోతులు వారిని బాహ్య ప్రపంచం నుంచి వేరు పరుస్తున్నవి. వారు యాత్రికులు కూడా కారు. వారికొక గమ్యం లేదు. చీకటి తప్ప వారికి తోడెవ్వరూ లేరు. వారు గర్వాంధతవల్ల అభిశప్తులైన నహుషులు. కాని ఆ పాపం వారిదే కాదు. అందరిదీ. అది సమస్త మానవకోటికీ వర్తిస్తుంది. నూతిలో గొంతుకలు సంశయ కావ్యం. దీనిలో మానవుడు ‘ఏది త్రోవ?’ అనే అడుగుతున్నాడు. ‘నాన్యః పథా విద్యతే యనాయ’ అని చెప్పగలిగే స్థితిలో లేడు. చీకటిలో ప్రారంభమైన ఈ కావ్యం ‘ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాలను’ చర్చిస్తున్నది. దీనిలోని నాయకులు ‘హేమ్లెట్, అర్జునుడు, రాస్కల్నికోవ్’ సందిగ్ధావస్తలో ఒక క్రమబద్ధమైన పరిణామాన్ని సూచిస్తున్నారు. హేమ్లెట్ వేదన కర్మపూర్వం. అర్జునుడి వేదన కర్మక్షేత్రంలో తక్షణికం. రాస్కల్నికోవ్ బాధకర్మ తరువాత. అది మానవుని సహజ వేదన. అతణ్ణి త్రికాలాల్లోనూ వెంటాడుతుంది. ఆ బాధలో మధన పడనివాడు పూర్ణత్వాన్ని అందుకోలేడు. ఆ బాధ నుంచి అతను తప్పుకునే మార్గం లేదా – అంటే ఉంది. పలాయనం, కృతకశక్తుల పూజనం. ఆత్మాహననం.
I want this book plz
© 2017,www.logili.com All Rights Reserved.