"పడమటి గోదావరి రాగం" అని చదివి ఇది ఒకే ప్రాతానికో.. లేక ఒకే విషయానికో చెందినదని అనుకుంటే పొరబడ్డట్టే మరి! మిమ్మల్ని ఒకోసారి నవ్విస్తూ.. ఒకోసారి మనసుకు హత్తుకునేలా చేసి.. ఒకోసారి ఆలోచింపచేస్తూ.. అన్ని కలగలిపిన మన తెలుగువారి విందు భోజనమే ఈ పుస్తకం.
గోదారి గలగాలతో.. పైరగాలి రెపరెపలతో.. మనసు పొడుకునే చక్కని పాటలాగా.. ఈ పుస్తకం మీ అందరి మదిలోతుల్లో దాగివున్న చిన్ననాటి జ్ఞాపకాలను బయటకు తీసి.. అలరిస్తుందని నా నమ్మకం.
ప్రేమతో..
మీ
శ్రీనివాసరాజు ఇందుకూరి
పసిడి తివాచీలు పరచినట్లుండే పంటపొలాలు...
పడుచువన్నెలతో ఒంపులు తిరిగిన కొబ్బరిచెట్లు..
నోరూరించే ఆవకాయ రుచులు...
కళ్ళాపి చల్లిన ముంగిళ్ళు..
ముగ్గులతో నిండిన వాకిళ్ళు..
ముసి ముసిగా నవ్వే లోగిళ్ళు...
కలివిడిగా మసిలే మనసులు...
కల్మషమెరుగని మనుషులు...
నవ్వుపుట్టించే గోదారొళ్ళ భాషలోని యాసలు...
ఎటకారాలు.. మమకారాలు.. అన్యోన్యతలు...
అతిగా అనిపించే మర్యాదలు..
అతిధి సత్కారాలు..
ఇది మా గోదారిజిల్లాల్లో ప్రత్యేకమేనండోయ్!