తెలుగులో చాల కథలు వంటకాలన్నీ ముందుగానే వడ్డించిన విస్తరులు. తన పాత్రేమీ లేకుండా ఆరగించటమే పాఠకుడి పని. నా కథల్లో చదువరి కొన్నిటిని ఊహించుకోవాలి. కొన్నిటిని తనే అందుకోవాలి. అవేమిటో ఆలోచించాలి. నిదానంగా ఆస్వాదించాలి. కథావరణంలో పాఠకుడికెంతో విహార స్వేచ్చ ఉంటుంది. మానవతావాదం, బౌద్ధం, మార్క్సిజం, అస్తిత్వవాదం, ఎరిక్ ఫ్రామ్ ఆలోచనాధార – ఇవన్నీ నా మనస్సు మీద చిక్కగా అల్లుకుపొయ్యాయి. ఆ నీడలు విడివిడిగా కథల్లో కనిపిస్తాయి. కథ గాని, కవిత గాని తాత్వికస్థాయికి తీసుకెళ్లటం నాకిష్టం.
జీవిత తాత్వికత లేని రచన నేనూహించలేను. మన సిద్ధాంతాలన్నీ మానవకేంద్రకాలే. మనిషిని ప్రకృతికి అంటుగా కాకుండా విడగొట్టి చూస్తాయి. ఈ లోటుని బౌద్ధంలోని సర్వప్రాణి ప్రేమతో నిండిన మైత్రీ తత్త్వం తీరుస్తుంది. ‘చివరి పిచ్చిక’, ‘జామచెట్టు’ కథల్లో ఆ సూత్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించా.
వాదాల కోసమో, ఉద్యమాల కోసమో నేనెప్పుడూ నావి కాని రచనలు చెయ్యలేదు. హృదయస్పందనని బట్టే అవి ఆయా ఉద్యమాలతో సంవదిస్తాయి. నా బాహ్యాంతర అనుభవాల పరిధిలోకి వచ్చిన వస్తువులే తీసుకున్నాను. వస్తుశిల్పాలలో వైవిధ్యం పాటించాను. నా ఆత్మ పూర్తిగా నిమగ్నం గాని రచనల పట్ల నాకిప్పుడు గౌరవం లేదు. నన్ను, నా రచనల్ని ఇష్టపడే సాహిత్య ప్రేమికులందరికీ ధన్యవాదాలు.
తెలుగులో చాల కథలు వంటకాలన్నీ ముందుగానే వడ్డించిన విస్తరులు. తన పాత్రేమీ లేకుండా ఆరగించటమే పాఠకుడి పని. నా కథల్లో చదువరి కొన్నిటిని ఊహించుకోవాలి. కొన్నిటిని తనే అందుకోవాలి. అవేమిటో ఆలోచించాలి. నిదానంగా ఆస్వాదించాలి. కథావరణంలో పాఠకుడికెంతో విహార స్వేచ్చ ఉంటుంది. మానవతావాదం, బౌద్ధం, మార్క్సిజం, అస్తిత్వవాదం, ఎరిక్ ఫ్రామ్ ఆలోచనాధార – ఇవన్నీ నా మనస్సు మీద చిక్కగా అల్లుకుపొయ్యాయి. ఆ నీడలు విడివిడిగా కథల్లో కనిపిస్తాయి. కథ గాని, కవిత గాని తాత్వికస్థాయికి తీసుకెళ్లటం నాకిష్టం. జీవిత తాత్వికత లేని రచన నేనూహించలేను. మన సిద్ధాంతాలన్నీ మానవకేంద్రకాలే. మనిషిని ప్రకృతికి అంటుగా కాకుండా విడగొట్టి చూస్తాయి. ఈ లోటుని బౌద్ధంలోని సర్వప్రాణి ప్రేమతో నిండిన మైత్రీ తత్త్వం తీరుస్తుంది. ‘చివరి పిచ్చిక’, ‘జామచెట్టు’ కథల్లో ఆ సూత్రాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించా. వాదాల కోసమో, ఉద్యమాల కోసమో నేనెప్పుడూ నావి కాని రచనలు చెయ్యలేదు. హృదయస్పందనని బట్టే అవి ఆయా ఉద్యమాలతో సంవదిస్తాయి. నా బాహ్యాంతర అనుభవాల పరిధిలోకి వచ్చిన వస్తువులే తీసుకున్నాను. వస్తుశిల్పాలలో వైవిధ్యం పాటించాను. నా ఆత్మ పూర్తిగా నిమగ్నం గాని రచనల పట్ల నాకిప్పుడు గౌరవం లేదు. నన్ను, నా రచనల్ని ఇష్టపడే సాహిత్య ప్రేమికులందరికీ ధన్యవాదాలు.© 2017,www.logili.com All Rights Reserved.