ఒక సంఘటన గానీ, కొన్ని సన్నివేశాలు గానీ, కథ కావచ్చు. కానీ అంతకన్న కథకు ప్రధానమైనది - అది కలిగించే 'అనుభవం'. ఒక కథ చదివాక 'అది మనగురించి మనకెంత తెలుసు' అని ఆలోచింపచేసి, మన జీవితపు ఎదో ఒక పార్శ్వాన్ని బలంగా తాకి, హృదయాన్ని స్పందింపజేసి, జీవనరసానుభావాన్ని ఆర్ద్రంగా అందించగలిగినప్పుడు అది మంచికథ అవుతుంది. మంచికథ వ్యక్తిత్వ వికాసానికి ప్రేరకమయ్యే జీవధాతువు.
అదిగో అలాంటి రసమంచిత మూలకణాలు - గంటి భానుమతిగారి కథల్లో కానవస్తాయి. నేలవిడిచి సాముచేసే ప్రయోజన రాహిత్యమైన ఊకదంపుడు సువిధానాలు ఆమెకు గిట్టవు. 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' అనే జీవనమకరందం అందించడం ఆ కథల లక్ష్యం. అందుకే ఈ కథల్లో ప్రకృతి, పరిసరాలు, సంఘటనలు ఏవయినా -మనుషుల గురించీ, వారి బ్రతుకుల సిసలైన సార్థకత గురించీ ఆరాటపడుతూంటాయి. మానవ సంబంధాలు నేడు మరీ ముఖ్యంగా పటిష్ఠం కావలసిన ఆత్మీయానుబంధాలు, ప్రకృతిలో మమేకమై నేర్చుకోవలసిన పాఠాలు, ఎంతటి ప్రతికూల, అనుకూల పరిస్థితుల్లోనయినా వదులుకోకూడని ఆశావహ దృక్పథం - మనసుకు హత్తుకునేలా కంటికి తాకే అభివ్యక్తి కాంతులు గంటి భానుమతి కథలు.
ఒక సంఘటన గానీ, కొన్ని సన్నివేశాలు గానీ, కథ కావచ్చు. కానీ అంతకన్న కథకు ప్రధానమైనది - అది కలిగించే 'అనుభవం'. ఒక కథ చదివాక 'అది మనగురించి మనకెంత తెలుసు' అని ఆలోచింపచేసి, మన జీవితపు ఎదో ఒక పార్శ్వాన్ని బలంగా తాకి, హృదయాన్ని స్పందింపజేసి, జీవనరసానుభావాన్ని ఆర్ద్రంగా అందించగలిగినప్పుడు అది మంచికథ అవుతుంది. మంచికథ వ్యక్తిత్వ వికాసానికి ప్రేరకమయ్యే జీవధాతువు. అదిగో అలాంటి రసమంచిత మూలకణాలు - గంటి భానుమతిగారి కథల్లో కానవస్తాయి. నేలవిడిచి సాముచేసే ప్రయోజన రాహిత్యమైన ఊకదంపుడు సువిధానాలు ఆమెకు గిట్టవు. 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' అనే జీవనమకరందం అందించడం ఆ కథల లక్ష్యం. అందుకే ఈ కథల్లో ప్రకృతి, పరిసరాలు, సంఘటనలు ఏవయినా -మనుషుల గురించీ, వారి బ్రతుకుల సిసలైన సార్థకత గురించీ ఆరాటపడుతూంటాయి. మానవ సంబంధాలు నేడు మరీ ముఖ్యంగా పటిష్ఠం కావలసిన ఆత్మీయానుబంధాలు, ప్రకృతిలో మమేకమై నేర్చుకోవలసిన పాఠాలు, ఎంతటి ప్రతికూల, అనుకూల పరిస్థితుల్లోనయినా వదులుకోకూడని ఆశావహ దృక్పథం - మనసుకు హత్తుకునేలా కంటికి తాకే అభివ్యక్తి కాంతులు గంటి భానుమతి కథలు.© 2017,www.logili.com All Rights Reserved.