అంధకారాన్ని జరపాలంటే, ప్రకాశాన్ని తేవాలి. మనస్సును జరపాలంటే, ధ్యానాన్ని తేవాలి. మనస్సును నియంత్రణ, అడ్డగింత చేయకూడదు. అది లేనే లేదని తెలుసుకోవాలి. ఇది తెలియగానే దానితో ముక్తి లభించును. ఇది తెలుసుకోవడము సాక్షి చైతన్యముతో అవుతుంది. మనస్సుకు సాక్షి అవ్వాలి. ఎలా అవ్వాలి అన్న చింత వదిలి వేయుము. ఏది ఉందో ఎలా ఉందో దాని యెడల మేల్కోవాలి, జాగరూకము అవ్వాలి. ఏ నిర్ణయము తీసుకోకూడదు, ఏ నియంత్రణ అడ్డగింత చేయకూడదు, ఏ సంఘర్షణలో పడకూడదు. కేవలము మౌనమై చూడు. చూడడమే, ఈ సాక్షి అవ్వడమే ముక్తి అవుతుంది. సాక్షి అవ్వగానే చైతన్యము దృశ్యాన్ని వదిలి చూచేవాని మీద స్థిరమగును. ఈ స్థితిలో చలనము లేని జ్ఞానజ్యోతి లభించును. ఈ జ్యోతియే ముక్తి.
అన్ని అవస్థలలో మనస్సు యొక్క అన్ని క్రియలను చూచేది సాక్షి, చూచేది మరియు చూడబడేది వేరు. చూచే సాక్షిని మీరు చూడలేరు. సాక్షి మీ స్వరూపము, మీ స్వభావము. సాక్షిభావము మేల్కోగానే మనసు ఉండదు, ఆత్మ ఉందును. సహజ భావము ఉన్నచో చిత్తంలో విరోధభావము, అహంకారము తొలగించినచో సమాధి తనంతట తానే ఫలించును.
- స్వామి సంతోషానంద
అంధకారాన్ని జరపాలంటే, ప్రకాశాన్ని తేవాలి. మనస్సును జరపాలంటే, ధ్యానాన్ని తేవాలి. మనస్సును నియంత్రణ, అడ్డగింత చేయకూడదు. అది లేనే లేదని తెలుసుకోవాలి. ఇది తెలియగానే దానితో ముక్తి లభించును. ఇది తెలుసుకోవడము సాక్షి చైతన్యముతో అవుతుంది. మనస్సుకు సాక్షి అవ్వాలి. ఎలా అవ్వాలి అన్న చింత వదిలి వేయుము. ఏది ఉందో ఎలా ఉందో దాని యెడల మేల్కోవాలి, జాగరూకము అవ్వాలి. ఏ నిర్ణయము తీసుకోకూడదు, ఏ నియంత్రణ అడ్డగింత చేయకూడదు, ఏ సంఘర్షణలో పడకూడదు. కేవలము మౌనమై చూడు. చూడడమే, ఈ సాక్షి అవ్వడమే ముక్తి అవుతుంది. సాక్షి అవ్వగానే చైతన్యము దృశ్యాన్ని వదిలి చూచేవాని మీద స్థిరమగును. ఈ స్థితిలో చలనము లేని జ్ఞానజ్యోతి లభించును. ఈ జ్యోతియే ముక్తి. అన్ని అవస్థలలో మనస్సు యొక్క అన్ని క్రియలను చూచేది సాక్షి, చూచేది మరియు చూడబడేది వేరు. చూచే సాక్షిని మీరు చూడలేరు. సాక్షి మీ స్వరూపము, మీ స్వభావము. సాక్షిభావము మేల్కోగానే మనసు ఉండదు, ఆత్మ ఉందును. సహజ భావము ఉన్నచో చిత్తంలో విరోధభావము, అహంకారము తొలగించినచో సమాధి తనంతట తానే ఫలించును. - స్వామి సంతోషానంద© 2017,www.logili.com All Rights Reserved.