బ్రాహ్మణపిల్ల
ఊరంతా తిరిగి తిరిగి మూడు ఝాములప్పుడు రాసమణి ఇంటికి బయలుదేరింది. ఆమె ముందు పది పన్నెండేళ్ళ మనమరాలు నడుస్తోంది. ఆ పల్లెటూరి ఇరుకు సందులో ఒకవైపున కట్టేసివున్న మేకపిల్ల మరొక వైపుకుపోయి పడుకుని నిద్రపోతోంది. దానిమీద దృష్టిపడగానే రాసమణి బిగ్గరగా "ఒసేయ్! ఆ తాడు దాటబోకు! దాటబోకు! దాటావూ? కళ్ళు ఆకాశాన పెట్టుకుని నడుస్తున్నావా ఏమే పాపిష్టిదానా? అలా కట్టేసి వుంచిన మేకపిల్ల కళ్ళకు కన్పించటంలా?” అని అరిచింది.
"మేక పిల్ల నిద్దరోతుంది నాయనమ్మా!” అన్నది మనమరాలు
అయితే ఇంక దోషం లేదా? ఈ మంగళవారప్పూటా నువ్వు చక్కగా కట్టుతాడు. దాటావా?"
"దాటితే ఏమౌతుంది నాయనమ్మా!”
"ఏమవుతుందా? దౌర్భాగ్యురాలా! బ్రాహ్మలింట పుట్టిన పది పన్నెండేళ్ళ ఆడ మొద్దువి - మేక కట్టుతాడు దాటకూడదని ఆమాత్రం తెలియదూ? ఏమవుతుందీ! అని మళ్ళీ అడుగుతున్నావా? అడ్డమైనవాళ్ళూ మేకల్ని మేపుకోవాలనే యావతో ఎక్కడపడితే అక్కడ వాటిని కట్టెయ్యటం మూలంగా నలుగురూ దారిని నడవటం మహా ఇబ్బందై పోతోంది. బాబూ ఉష్! మంగళవారం మధ్యాహ్నప్పూటా ఈ కుర్రది మేక కట్టుతాడు. దాటింది - ఎంచేత? దారి కడ్డంగా మేకల్ని ఎందుకు కట్టెయ్యాలి? వాళ్ళకు మాత్రం పిల్లా జెల్లాలేరా అని అడుగుతా. ఏమైనా మంచీచెడు అవుతుందని వాళ్ళకామాత్రం తెలియదూ?
హఠాత్తుగా ఆమె దృష్టి పన్నెండు, పదమూడేళ్ళ యానాదిపిల్లమీద పడింది. అది భయంతో గాభరాపడుతూ తన మేకపిల్లను అక్కడినుండి తీసుకువెళ్ళటానికి వస్తోంది. అప్పుడామె, ఎదుటలేని వాళ్ళని వదిలిపెట్టి ఎదురుగా వస్తున్న దీని మీదపడి - తీక్షణమైన కంఠంతో - "నువ్వెవత్తెవే పాడుపీనుగా! బొత్తిగా రాచుకునే పోతున్నావే! నీకు కళ్ళూ, చెవులూ లేవా ఏమే! కన్పించటంలా? నీ చెంగు కాస్తా పిల్లదానికేసి కొట్టావూ?” అన్నది.
ఆ పిల్లది భయంతో - "లేదండి అవ్వగారూ! నేను ఇవతల నుంచి వస్తున్నాను” అన్నది. రాసమణి తన ముఖాన్ని అతి వికారంగా పెట్టి, "అవతల నుంచి వెడుతున్నావా? నీకు అవతల నుంచి వెళ్ళాల్సిన అవసరమేముందే? ఈ మేకపిల్ల నీదే ననుకుంటా? నీ కులమేమిటే అసలు?” అన్నది...........
బ్రాహ్మణపిల్ల ఊరంతా తిరిగి తిరిగి మూడు ఝాములప్పుడు రాసమణి ఇంటికి బయలుదేరింది. ఆమె ముందు పది పన్నెండేళ్ళ మనమరాలు నడుస్తోంది. ఆ పల్లెటూరి ఇరుకు సందులో ఒకవైపున కట్టేసివున్న మేకపిల్ల మరొక వైపుకుపోయి పడుకుని నిద్రపోతోంది. దానిమీద దృష్టిపడగానే రాసమణి బిగ్గరగా "ఒసేయ్! ఆ తాడు దాటబోకు! దాటబోకు! దాటావూ? కళ్ళు ఆకాశాన పెట్టుకుని నడుస్తున్నావా ఏమే పాపిష్టిదానా? అలా కట్టేసి వుంచిన మేకపిల్ల కళ్ళకు కన్పించటంలా?” అని అరిచింది. "మేక పిల్ల నిద్దరోతుంది నాయనమ్మా!” అన్నది మనమరాలు అయితే ఇంక దోషం లేదా? ఈ మంగళవారప్పూటా నువ్వు చక్కగా కట్టుతాడు. దాటావా?" "దాటితే ఏమౌతుంది నాయనమ్మా!” "ఏమవుతుందా? దౌర్భాగ్యురాలా! బ్రాహ్మలింట పుట్టిన పది పన్నెండేళ్ళ ఆడ మొద్దువి - మేక కట్టుతాడు దాటకూడదని ఆమాత్రం తెలియదూ? ఏమవుతుందీ! అని మళ్ళీ అడుగుతున్నావా? అడ్డమైనవాళ్ళూ మేకల్ని మేపుకోవాలనే యావతో ఎక్కడపడితే అక్కడ వాటిని కట్టెయ్యటం మూలంగా నలుగురూ దారిని నడవటం మహా ఇబ్బందై పోతోంది. బాబూ ఉష్! మంగళవారం మధ్యాహ్నప్పూటా ఈ కుర్రది మేక కట్టుతాడు. దాటింది - ఎంచేత? దారి కడ్డంగా మేకల్ని ఎందుకు కట్టెయ్యాలి? వాళ్ళకు మాత్రం పిల్లా జెల్లాలేరా అని అడుగుతా. ఏమైనా మంచీచెడు అవుతుందని వాళ్ళకామాత్రం తెలియదూ? హఠాత్తుగా ఆమె దృష్టి పన్నెండు, పదమూడేళ్ళ యానాదిపిల్లమీద పడింది. అది భయంతో గాభరాపడుతూ తన మేకపిల్లను అక్కడినుండి తీసుకువెళ్ళటానికి వస్తోంది. అప్పుడామె, ఎదుటలేని వాళ్ళని వదిలిపెట్టి ఎదురుగా వస్తున్న దీని మీదపడి - తీక్షణమైన కంఠంతో - "నువ్వెవత్తెవే పాడుపీనుగా! బొత్తిగా రాచుకునే పోతున్నావే! నీకు కళ్ళూ, చెవులూ లేవా ఏమే! కన్పించటంలా? నీ చెంగు కాస్తా పిల్లదానికేసి కొట్టావూ?” అన్నది. ఆ పిల్లది భయంతో - "లేదండి అవ్వగారూ! నేను ఇవతల నుంచి వస్తున్నాను” అన్నది. రాసమణి తన ముఖాన్ని అతి వికారంగా పెట్టి, "అవతల నుంచి వెడుతున్నావా? నీకు అవతల నుంచి వెళ్ళాల్సిన అవసరమేముందే? ఈ మేకపిల్ల నీదే ననుకుంటా? నీ కులమేమిటే అసలు?” అన్నది...........© 2017,www.logili.com All Rights Reserved.