యావద్భారతదేశము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, పీడిత జనోద్ధార లక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమైన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలందుకున్న మహా రచయిత శ్రీపాద. పద్యరచనలు, నాటకాలు, నాటికలు - రేడియో నాటికలు, నాటకాలు, నవలలు, అనేక రచనలు చేసినా ప్రధానంగా కథారచయిత.
కథనం చెక్కడంలో శ్రీపాద వారొక మహాశిల్పి, నేపథ్య నిర్మాణంలో శాస్త్రి గారొక చిత్రకారుడు, వర్ణనల విషయంలో ఎక్సరే కలం ఆయనది. రెండో మూడూ పాత్రలను తీసుకుని చాలా అమాయకంగా కథనెత్తుకుని క్లిష్టమైన సన్నివేశాల్లోకి మన గుండెల్ని పట్టుకొని లాక్కువెళ్లి శతఘ్నులు పేల్చగల ఫీల్డ్ మార్షల్ శ్రీపాద. వ్యవహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలందించారు. కథా రచయితగా గురజాడ మార్గాన్ని ముందుకు తీసుకువెళ్ళారు శ్రీపాద. ఇవే మా తెలుగు కథలంటూ, తెలుగు వాళ్ళు గర్వించదగ్గ కథలనందించిన ఘనాపాటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.
యావద్భారతదేశము ఆదర్శంగా నిలుపుకోగల జాతీయతా స్పృహతో, సమాజ సంస్కరణాభిలాషతో, పీడిత జనోద్ధార లక్ష్యంతో, సౌహార్ధాభివ్యక్తితో అద్భుతమైన రచనలు చేసి అనేక తరాలవారి మన్ననలందుకున్న మహా రచయిత శ్రీపాద. పద్యరచనలు, నాటకాలు, నాటికలు - రేడియో నాటికలు, నాటకాలు, నవలలు, అనేక రచనలు చేసినా ప్రధానంగా కథారచయిత. కథనం చెక్కడంలో శ్రీపాద వారొక మహాశిల్పి, నేపథ్య నిర్మాణంలో శాస్త్రి గారొక చిత్రకారుడు, వర్ణనల విషయంలో ఎక్సరే కలం ఆయనది. రెండో మూడూ పాత్రలను తీసుకుని చాలా అమాయకంగా కథనెత్తుకుని క్లిష్టమైన సన్నివేశాల్లోకి మన గుండెల్ని పట్టుకొని లాక్కువెళ్లి శతఘ్నులు పేల్చగల ఫీల్డ్ మార్షల్ శ్రీపాద. వ్యవహారిక భాషావాదిగా గిడుగు ఉద్యమానికి అండదండలందించారు. కథా రచయితగా గురజాడ మార్గాన్ని ముందుకు తీసుకువెళ్ళారు శ్రీపాద. ఇవే మా తెలుగు కథలంటూ, తెలుగు వాళ్ళు గర్వించదగ్గ కథలనందించిన ఘనాపాటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి.© 2017,www.logili.com All Rights Reserved.