గత అర్ధ శతాబ్దకాలంగా గ్రామాల్లోనూ, నగరాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, మానవ మనస్తత్వాలపై వాటి ప్రభావాల విశ్లేషణ శ్రీపతి కథల ముడిసరుకు. ఒకవైపు ఆధునికత శరవేగంగా జీవితాల్లోకి, కుటుంబాల్లోకి దూసుకువస్తున్నా మరోవైపు మనల్ని వదలకుండా పట్టుబిగిస్తున్న కులం, కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు, కట్టు కథల ప్రచారం, ద్వంద్వ విలువలు చక్కటి కథాకథనంతో, చిక్కటి శిల్పంతో, సహజసిద్ధమైన వాడుకభాషలో ప్రకటితమైన ఉత్తమ కథాగుచ్చం ఈ సంపుటి.
సామాన్య ప్రజలకి కడుపునిండా గంజి, చేతినిండా పని, కళ్ళ నిండా నిద్ర, ఉండటానికి ఇల్లు సమకూరాలన్న సామాజిక స్వప్నతో శ్రీపతి రచించిన కథలివి. మనిషినీ, మనిషిలోనీ ప్రేమించే మనిషితనాన్ని ప్రేమించే ఉదాత్త లక్షణం శ్రీపతి కథలకు జీవనాడి.
జీవిత వాస్తవాలను దర్శించిన కథలు ఇవి. అలవోకగా పద చిత్రాలు గీసినట్లుగా ఉండే ఈ కథలో కవులను సైతం ఆశ్చర్యపరచే కాల్పనిక తీవ్రత కనపడుతుంది. కథా సాహిత్య చరిత్రకు న్యాయం చేకూర్చే కథలే గాక పాఠ్యబోధనకు కూడా పనికివచ్చే పాఠ్యాంశాలు ఈ కథలు. శ్రీపతి కథల సందేశం విశ్వజనీనం.
గత అర్ధ శతాబ్దకాలంగా గ్రామాల్లోనూ, నగరాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, మానవ మనస్తత్వాలపై వాటి ప్రభావాల విశ్లేషణ శ్రీపతి కథల ముడిసరుకు. ఒకవైపు ఆధునికత శరవేగంగా జీవితాల్లోకి, కుటుంబాల్లోకి దూసుకువస్తున్నా మరోవైపు మనల్ని వదలకుండా పట్టుబిగిస్తున్న కులం, కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు, కట్టు కథల ప్రచారం, ద్వంద్వ విలువలు చక్కటి కథాకథనంతో, చిక్కటి శిల్పంతో, సహజసిద్ధమైన వాడుకభాషలో ప్రకటితమైన ఉత్తమ కథాగుచ్చం ఈ సంపుటి. సామాన్య ప్రజలకి కడుపునిండా గంజి, చేతినిండా పని, కళ్ళ నిండా నిద్ర, ఉండటానికి ఇల్లు సమకూరాలన్న సామాజిక స్వప్నతో శ్రీపతి రచించిన కథలివి. మనిషినీ, మనిషిలోనీ ప్రేమించే మనిషితనాన్ని ప్రేమించే ఉదాత్త లక్షణం శ్రీపతి కథలకు జీవనాడి. జీవిత వాస్తవాలను దర్శించిన కథలు ఇవి. అలవోకగా పద చిత్రాలు గీసినట్లుగా ఉండే ఈ కథలో కవులను సైతం ఆశ్చర్యపరచే కాల్పనిక తీవ్రత కనపడుతుంది. కథా సాహిత్య చరిత్రకు న్యాయం చేకూర్చే కథలే గాక పాఠ్యబోధనకు కూడా పనికివచ్చే పాఠ్యాంశాలు ఈ కథలు. శ్రీపతి కథల సందేశం విశ్వజనీనం.© 2017,www.logili.com All Rights Reserved.