ఎందుకు పారేస్తాను నాన్నా!
-చాగంటి సోమయాజులు
చెల్లిని వొళ్లో కూచోపెట్టుకుని వంటింట్లో కబుర్లు చెప్పుతున్నాడు, కృష్ణుడు. వాళ్ళ నాన్న పిలిచి చుట్టలు తెమ్మని డబ్బులిచ్చాడు.
కృష్ణుడు వీధి ముఖం చూడకుండా, మొగుడు చచ్చిన విధవలాగా ఇంట్లో దూరి కూచుంటున్నాడు. నాన్న చుట్టలు తెమ్మని పురమాయించేడు. హైస్కూలు దాటి చుట్టల దుకాణాని కెళ్లాలి. మేస్టర్లు, తోటి విద్యార్థులు అక్కడుంటారు. కృష్ణుడికి రోడ్డెక్కడమే నామోషిగా ఉంది. బడి పక్క నుంచి ఎలాగ వెళ్ళడమని గింజుకుంటూ బయలుదేరేడు.
ఉదయం ఎనిమిది గంటలు కావొస్తున్నాది. బడిపెట్టేవేళ, వీధి చివర నుంచే బడిగోల సముద్రపు ఘోషలాగ వినపడుతున్నది. బడి పక్క నుంచి వెళ్ళక తప్పదు; రాక తప్పదు.
బడి కనబడగానే కృష్ణుడికి బెంగ పట్టుకుంది. హైస్కూలు పిల్లల గందర గోళంతో కలకల్లాడుతున్నాది. వరండాలు, గదులు, చుట్టూ రోడ్లు, విద్యార్థులతో విద్యార్థినులతో చూడ సొంపుగా ఉంది. రోడ్డు వారగా కృష్ణుడు తలొంచుకొని పరిగెట్టాడు.
"కృష్ణా!" అని స్కూలు వరండాలోంచి కేకొచ్చింది. కృష్ణుడు తిరిగి చూడక తప్పింది కాదు. నరిసింహం పరిగెట్టుకొచ్చి వాడి బుజం మీద చెయ్యేసి -
"ఏం రా నువ్వు బళ్లోకి రావడం లేదు?” అనడిగేడు.
"సోమవారం చేరుతాను" అని కృష్ణుడు చేప్పేడు.
"పుస్తకాలు కొన్నావా?"
"ఇంకా లేదు"................
© 2017,www.logili.com All Rights Reserved.