ఈ రచయిత్రి ఆకాశవాణిలో వినిపించిన కధానిక పేరు "సత్యం". పక్కన దక్షిణం వైపు ఇంటివాళ్ళ పనిమనిషీ ఉత్తరంవైపు స్కూల్ విద్యార్ధి తల్లీ పడవలసి వస్తున్నా వాళ్ళ వాళ్ళ యజమానురాళ్ళ ఈసడింపులకు వెనకనున్న సత్యాన్ని తెలివిడిచేసే వృత్తంతమిది. "ఇది ఇలా ఉన్నప్పుడు అది అలా ఎలా ఉంటుంది!" అనుకొనే వ్యక్తికి "ఇది ఇలా ఉంది కాబట్టే అది అలా ఉంటుంది" అన్న సత్తెమ్మ మాటలు కొత్తకోణాన్ని చూపించాయి. "నిజానికి రెండు సత్యాలు లేవు. రెండు సిద్ధంతాలకీ ఘర్షణ లేదు. ఒకే సత్యాన్ని తర్కం రెండుగా భ్రమింపజేస్తోంది," అనిపించింది. "అవతలివారిని (వాళ్ళ అభిప్రాయాన్ని) ఒప్పుకోలేకపోవడానికి కారణం, వారి సత్యం విభిన్నమవడం కాదు. మనల్ని భయమో, శోకమో కమ్ముకోడం". ఈ కధారచయిత్రిలో తాత్త్వకచింతనపరురాలు లేదని ఎవరనగలరు!
"డిసెంబర్ 31 తేదీ సంబరంలో పదినిమిషాలసేపు నాట్యం చేసే అమ్మాయికి రెండు లక్షలు ఇస్తారట", అన్న సమాచారం మీద కోందరమ్మాయిలు చేస్తున్న వ్యఖ్యలను విన్నారు నిత్యా, ఆమెకు కాబోయే మామగారును. "చెప్పు, ఎంత తీసుకుంటే అవమానం కాదు, గౌరవం అనిపించుకుంటుంది!...నువ్వయితే ఏమంటావ్!" అని సూటిగా ప్రశ్నించారు ఆయన. "నేనా!" అంటూ నవ్వింది ఆమె. "నేనయితే రెండు లక్షలు కాదు. కోట్లు గుమ్మరించినా అలా డాన్స్ చేయను అంటాను", అంది నిత్య. ఆ మాటకు ఉలిక్కిపడ్డారాయన. ఆ అమ్మాయి ఆణిముత్యం అని గ్రహించారు. అంతకంటే కావలసిందేముంది!.
టి. శ్రీవల్లీ రాధిక
ఈ రచయిత్రి ఆకాశవాణిలో వినిపించిన కధానిక పేరు "సత్యం". పక్కన దక్షిణం వైపు ఇంటివాళ్ళ పనిమనిషీ ఉత్తరంవైపు స్కూల్ విద్యార్ధి తల్లీ పడవలసి వస్తున్నా వాళ్ళ వాళ్ళ యజమానురాళ్ళ ఈసడింపులకు వెనకనున్న సత్యాన్ని తెలివిడిచేసే వృత్తంతమిది. "ఇది ఇలా ఉన్నప్పుడు అది అలా ఎలా ఉంటుంది!" అనుకొనే వ్యక్తికి "ఇది ఇలా ఉంది కాబట్టే అది అలా ఉంటుంది" అన్న సత్తెమ్మ మాటలు కొత్తకోణాన్ని చూపించాయి. "నిజానికి రెండు సత్యాలు లేవు. రెండు సిద్ధంతాలకీ ఘర్షణ లేదు. ఒకే సత్యాన్ని తర్కం రెండుగా భ్రమింపజేస్తోంది," అనిపించింది. "అవతలివారిని (వాళ్ళ అభిప్రాయాన్ని) ఒప్పుకోలేకపోవడానికి కారణం, వారి సత్యం విభిన్నమవడం కాదు. మనల్ని భయమో, శోకమో కమ్ముకోడం". ఈ కధారచయిత్రిలో తాత్త్వకచింతనపరురాలు లేదని ఎవరనగలరు! "డిసెంబర్ 31 తేదీ సంబరంలో పదినిమిషాలసేపు నాట్యం చేసే అమ్మాయికి రెండు లక్షలు ఇస్తారట", అన్న సమాచారం మీద కోందరమ్మాయిలు చేస్తున్న వ్యఖ్యలను విన్నారు నిత్యా, ఆమెకు కాబోయే మామగారును. "చెప్పు, ఎంత తీసుకుంటే అవమానం కాదు, గౌరవం అనిపించుకుంటుంది!...నువ్వయితే ఏమంటావ్!" అని సూటిగా ప్రశ్నించారు ఆయన. "నేనా!" అంటూ నవ్వింది ఆమె. "నేనయితే రెండు లక్షలు కాదు. కోట్లు గుమ్మరించినా అలా డాన్స్ చేయను అంటాను", అంది నిత్య. ఆ మాటకు ఉలిక్కిపడ్డారాయన. ఆ అమ్మాయి ఆణిముత్యం అని గ్రహించారు. అంతకంటే కావలసిందేముంది!. టి. శ్రీవల్లీ రాధిక© 2017,www.logili.com All Rights Reserved.