"ఈనాటి నానుడులు" అన్న పేరుతొ రచించబడిన ఈ గ్రంథం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందలి నానుడులు లోకస్థితిని యథాతథంగా చూపే కవితాదర్పణాలుగా విలసిల్లుతున్నాయి. అలా చూపే ప్రక్రియలోనే మనం అనుసరించదగిన నీతిని కూడా ఉపదేశిస్తున్నాయి. ఉదాహరణకు-
అంతస్సౌ౦దర్యం బాహ్యసౌందర్యం,
తారతమ్యం తెలిస్తే ప్రయోజనం
అన్నమాట ఆలోచనామృతసదృశమైనది. బాహ్యమైన అందచందాల ఆకర్షణకు లోనై హృదయగతమైన సౌందర్యాన్ని పరిగణించనివాని జీవితం వ్యర్థం. అంతస్సౌందర్యం శాశ్వతం. బాహ్యసౌందర్యం తాత్కాలికం. ఈ రెండు సౌందర్యాలలోని తరతమభేదాన్ని గ్రహించి అంతస్సౌందర్యాన్ని ఆరాధిస్తే శాశ్వతశాంతిసుఖాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఈ వాక్యాన్ని పరిశీలిస్తే ఎంతో అర్ధగాంభీర్యం గోచరిస్తుంది.
ఇలా నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా మనం గ్రహింపదగిన ఎన్నో విషయాలను "నేటి నానుడులు"గా మార్చి ఈ పుస్తకం ద్వారా మనకందించారు.
- శ్రీ దూబగుంట రామకృష్ణ
"ఈనాటి నానుడులు" అన్న పేరుతొ రచించబడిన ఈ గ్రంథం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇందలి నానుడులు లోకస్థితిని యథాతథంగా చూపే కవితాదర్పణాలుగా విలసిల్లుతున్నాయి. అలా చూపే ప్రక్రియలోనే మనం అనుసరించదగిన నీతిని కూడా ఉపదేశిస్తున్నాయి. ఉదాహరణకు- అంతస్సౌ౦దర్యం బాహ్యసౌందర్యం, తారతమ్యం తెలిస్తే ప్రయోజనం అన్నమాట ఆలోచనామృతసదృశమైనది. బాహ్యమైన అందచందాల ఆకర్షణకు లోనై హృదయగతమైన సౌందర్యాన్ని పరిగణించనివాని జీవితం వ్యర్థం. అంతస్సౌందర్యం శాశ్వతం. బాహ్యసౌందర్యం తాత్కాలికం. ఈ రెండు సౌందర్యాలలోని తరతమభేదాన్ని గ్రహించి అంతస్సౌందర్యాన్ని ఆరాధిస్తే శాశ్వతశాంతిసుఖాలు ప్రాప్తిస్తాయి. ఇలా ఈ వాక్యాన్ని పరిశీలిస్తే ఎంతో అర్ధగాంభీర్యం గోచరిస్తుంది. ఇలా నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా మనం గ్రహింపదగిన ఎన్నో విషయాలను "నేటి నానుడులు"గా మార్చి ఈ పుస్తకం ద్వారా మనకందించారు. - శ్రీ దూబగుంట రామకృష్ణ© 2017,www.logili.com All Rights Reserved.