ఆరోగ్యము - యోగ సాధన
పరిచయము :- యోగ సాధన యొక్క ఆవశ్యకము, ప్రాముఖ్యత మరియు ఆరోగ్యముపై యోగా యొక్క ప్రభావము ప్రపంచ మంతటా గుర్తించబడి ఉంది. సౌభాగ్యోపనిషత్ నందు యోగము నుద్దేశించి శ్లోకం ఇలా ఉంది.
యోగము వలన, యోగము వృద్ధిచెందుతున్నది ! కనుక యోగమునకు
ఈశ్వర ప్రసాధితమైన యోగ విద్యకు ఎవరూ, నాంది కాదు నేను, యోగాన్ని అభివృద్ధి చేశాను అని చెప్పుకోరాదు. యోగ మంటేనే ఈశ్వరుడు సకల చరా చర సృష్టికర్త. అన్ని తానై యున్నాడు. అందుకే, యోగం సాధన చేయాలి, అని సంకల్పిస్తే చాలా యోగం తనే దారి చూపుతుంది. కారణం అయిన గురువు నిమిత్తమాతృలే! యోగానికి ఎవరి వలన పేరు రాదు యోగం వలననే వారికి గుర్తింపు వస్తుంది. యోగం సనాతనం, యోగీ సనాతనుడు. అందుకే యోగానికి యోగమే గురువు.
పీఠిక
భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానానికి పుట్టినిల్లు లాంటిది. ఎందరో తాత్వికులు, ఋషులు, యోగులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఉన్నారు. ప్రస్తుతం ఈ పుస్తకము నందు యోగాసనములు, ప్రాణాయామా విధానములను మాత్రమే ప్రస్తావించటం జరిగింది. స్వాత్మారామా యోగీంద్రులు వారు హఠయోగ శాస్త్రాన్ని గ్రంధస్థం చేసియున్నారు. హఠయోగ ప్రదీపికగా రచించి ఉన్న గ్రంధం యోగాభ్యాసమునకు మూల ప్రధంగా ఉన్నది. హఠము అనగా బలము లేదా శక్తి అని అర్థం. యోగాభ్యాస సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందుటే ముఖ్య
హఠయోగ శాస్త్రజ్ఞానాన్ని సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడే శ్రీ మశ్చేంద్రనాధ యోగికి భోదించిరని, హఠయోగ గ్రంధం తెలుపుతున్నది. శ్రీ మశ్చేంద్రనాధయోగి ద్వారా ఆయన శిష్యులు శ్రీ గోరాక్షనాదులు గ్రహించారు. ఆయన నుండి శ్రీ స్వాత్మారాములు అభ్యసించి యోగ విధానములను హఠయోగ ప్రదీపికగా గ్రంధస్థం చేయబడినది. యోగా శాస్త్రాలు అనేకం ఉన్నా కూడా ఈ గ్రంధం శ్రేష్టమైనదిగా గురువులు తెలిపారు.............
ఆరోగ్యము - యోగ సాధన పరిచయము :- యోగ సాధన యొక్క ఆవశ్యకము, ప్రాముఖ్యత మరియు ఆరోగ్యముపై యోగా యొక్క ప్రభావము ప్రపంచ మంతటా గుర్తించబడి ఉంది. సౌభాగ్యోపనిషత్ నందు యోగము నుద్దేశించి శ్లోకం ఇలా ఉంది. 'యోగేన యోగ జ్ఞాతవ్యో, యోగో యోగా త్ప్రవర్తతే ” భావము :- యోగము చేతనే యోగము తెలియబడుతున్నది! యోగము వలన, యోగము వృద్ధిచెందుతున్నది ! కనుక యోగమునకు ఈశ్వర ప్రసాధితమైన యోగ విద్యకు ఎవరూ, నాంది కాదు నేను, యోగాన్ని అభివృద్ధి చేశాను అని చెప్పుకోరాదు. యోగ మంటేనే ఈశ్వరుడు సకల చరా చర సృష్టికర్త. అన్ని తానై యున్నాడు. అందుకే, యోగం సాధన చేయాలి, అని సంకల్పిస్తే చాలా యోగం తనే దారి చూపుతుంది. కారణం అయిన గురువు నిమిత్తమాతృలే! యోగానికి ఎవరి వలన పేరు రాదు యోగం వలననే వారికి గుర్తింపు వస్తుంది. యోగం సనాతనం, యోగీ సనాతనుడు. అందుకే యోగానికి యోగమే గురువు. పీఠిక భారతదేశం ఆధ్యాత్మిక జ్ఞానానికి పుట్టినిల్లు లాంటిది. ఎందరో తాత్వికులు, ఋషులు, యోగులు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఉన్నారు. ప్రస్తుతం ఈ పుస్తకము నందు యోగాసనములు, ప్రాణాయామా విధానములను మాత్రమే ప్రస్తావించటం జరిగింది. స్వాత్మారామా యోగీంద్రులు వారు హఠయోగ శాస్త్రాన్ని గ్రంధస్థం చేసియున్నారు. హఠయోగ ప్రదీపికగా రచించి ఉన్న గ్రంధం యోగాభ్యాసమునకు మూల ప్రధంగా ఉన్నది. హఠము అనగా బలము లేదా శక్తి అని అర్థం. యోగాభ్యాస సాధన ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందుటే ముఖ్య హఠయోగ శాస్త్రజ్ఞానాన్ని సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడే శ్రీ మశ్చేంద్రనాధ యోగికి భోదించిరని, హఠయోగ గ్రంధం తెలుపుతున్నది. శ్రీ మశ్చేంద్రనాధయోగి ద్వారా ఆయన శిష్యులు శ్రీ గోరాక్షనాదులు గ్రహించారు. ఆయన నుండి శ్రీ స్వాత్మారాములు అభ్యసించి యోగ విధానములను హఠయోగ ప్రదీపికగా గ్రంధస్థం చేయబడినది. యోగా శాస్త్రాలు అనేకం ఉన్నా కూడా ఈ గ్రంధం శ్రేష్టమైనదిగా గురువులు తెలిపారు.............© 2017,www.logili.com All Rights Reserved.