'యోగము' అంటే ఏకత్వము. అంటే ఒకటిగా ఉండటం. అనేక వస్తువులు ఒకటిగా చేయడం కాదు.
'యోగమ'ను మాటకు జతపరుచుట అనియు అర్థము. 'నాది' అనబడు బాహ్యవస్తు సంపద నుండి 'నేను' అనబడు వెలుగునకు దారి.
బుద్ధుని కర్మాచారణముతో జతపరుపవలెను. అప్పుడు మాత్రమే కర్మ యొక్క బంధము విప్పుకొనుట సాధ్యపడును.
యోగాభ్యాసానికై ఆరోహణ చేస్తున్నవాడు, ఆరోహణ చేసినవాడు కూడా అదే కర్మ ఆచరించాలి. ఆరోహణ చేస్తున్నవాడు తాను పొందవలసిన స్థితికోసం చేయాలి. ఆరోహణ చేసినవాడు ఆ స్థితి నుంచి బ్రష్టు పట్టకుండా ఉండటానికి చేయాలి.
అనన్యభక్తి సాధన ముందు చక్కని క్రమమార్గమున్నది. కనిపించుచున్న వారి రూపములనే విశ్వరూపుని మూర్తులుగా ధ్యానము చేయుచు, వారి యెడల మన బాధ్యతలను నిర్వర్తించుచు, ఆ ప్రయత్నమే దైవారాధనగా సాధించవలెను.
- కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య
'యోగము' అంటే ఏకత్వము. అంటే ఒకటిగా ఉండటం. అనేక వస్తువులు ఒకటిగా చేయడం కాదు. 'యోగమ'ను మాటకు జతపరుచుట అనియు అర్థము. 'నాది' అనబడు బాహ్యవస్తు సంపద నుండి 'నేను' అనబడు వెలుగునకు దారి. బుద్ధుని కర్మాచారణముతో జతపరుపవలెను. అప్పుడు మాత్రమే కర్మ యొక్క బంధము విప్పుకొనుట సాధ్యపడును. యోగాభ్యాసానికై ఆరోహణ చేస్తున్నవాడు, ఆరోహణ చేసినవాడు కూడా అదే కర్మ ఆచరించాలి. ఆరోహణ చేస్తున్నవాడు తాను పొందవలసిన స్థితికోసం చేయాలి. ఆరోహణ చేసినవాడు ఆ స్థితి నుంచి బ్రష్టు పట్టకుండా ఉండటానికి చేయాలి. అనన్యభక్తి సాధన ముందు చక్కని క్రమమార్గమున్నది. కనిపించుచున్న వారి రూపములనే విశ్వరూపుని మూర్తులుగా ధ్యానము చేయుచు, వారి యెడల మన బాధ్యతలను నిర్వర్తించుచు, ఆ ప్రయత్నమే దైవారాధనగా సాధించవలెను. - కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య© 2017,www.logili.com All Rights Reserved.