కలుపు వలన వివిధ పైర్లలో కలిగే నష్టం సుమారు 33 శాతం వరకు ఉంటుందని ఒక అంచనా. అంతేకాక కలుపు మొక్కలు చీడపీడలకు ఆశ్రయమిచ్చి వాటి వ్యాప్తికి సహకరించి తద్వారా రైతుకు సస్యరక్షణపై ఖర్చును కూడా పెంచుతాయి. ఇన్ని విధాలుగా రైతులకు నష్టం కలిగించే కలుపు మొక్కల నిర్మూలన గురించి రైతులకు అవగాహన అవసరం. మారిన పరిస్థితులలో అనేక కొత్త కలుపు మందులు, పద్ధతులు గురించి రైతులకు తెలియచేయాల్సిన అంశాలతో పాటు రైతులకు వివిధ పైర్లలో తక్కువ ఖర్చుతో కలుపు నిర్మూలనలో అవగాహన కలిగించేందుకు ఈ పుస్తకం చాలా వరకు ఉపయోగపడుతుందని నా నమ్మకం.
మార్కెట్ లో దొరికే వివిధ రకాల కలుపు మందులు, వివిధ పైర్లలో కలుపు యాజమాన్యం, కలుపు మందుల వాడుకలో తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు మొదలగు అనేక విషయాలు దీనిలో వివరంగా చెప్పడం జరిగింది. నా దృష్టిలో ఈ పుస్తకము రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ విస్తరణ, పలు కలుపు మందుల కంపెనీల విస్తరణ సిబ్బందికి కూడా ఉపయోగపడుతుంది. వారందరికీ ఇది ఒక కరదీపిక. రైతులకు ఉపయుక్తమైన ఇటువంటి పుస్తకాన్ని శ్రమకోర్చి అందుబాటులోకి తీసుకువచ్చిన రచయిత ఎ ఎస్ రావు ఎంతో అభినందనీయులు.
కలుపు వలన వివిధ పైర్లలో కలిగే నష్టం సుమారు 33 శాతం వరకు ఉంటుందని ఒక అంచనా. అంతేకాక కలుపు మొక్కలు చీడపీడలకు ఆశ్రయమిచ్చి వాటి వ్యాప్తికి సహకరించి తద్వారా రైతుకు సస్యరక్షణపై ఖర్చును కూడా పెంచుతాయి. ఇన్ని విధాలుగా రైతులకు నష్టం కలిగించే కలుపు మొక్కల నిర్మూలన గురించి రైతులకు అవగాహన అవసరం. మారిన పరిస్థితులలో అనేక కొత్త కలుపు మందులు, పద్ధతులు గురించి రైతులకు తెలియచేయాల్సిన అంశాలతో పాటు రైతులకు వివిధ పైర్లలో తక్కువ ఖర్చుతో కలుపు నిర్మూలనలో అవగాహన కలిగించేందుకు ఈ పుస్తకం చాలా వరకు ఉపయోగపడుతుందని నా నమ్మకం. మార్కెట్ లో దొరికే వివిధ రకాల కలుపు మందులు, వివిధ పైర్లలో కలుపు యాజమాన్యం, కలుపు మందుల వాడుకలో తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు మొదలగు అనేక విషయాలు దీనిలో వివరంగా చెప్పడం జరిగింది. నా దృష్టిలో ఈ పుస్తకము రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, వ్యవసాయ విస్తరణ, పలు కలుపు మందుల కంపెనీల విస్తరణ సిబ్బందికి కూడా ఉపయోగపడుతుంది. వారందరికీ ఇది ఒక కరదీపిక. రైతులకు ఉపయుక్తమైన ఇటువంటి పుస్తకాన్ని శ్రమకోర్చి అందుబాటులోకి తీసుకువచ్చిన రచయిత ఎ ఎస్ రావు ఎంతో అభినందనీయులు.© 2017,www.logili.com All Rights Reserved.