హిందూ ధర్మం ప్రపంచంలో అతి ప్రాచీనం. దానికి వేదాలు మూలం. వేదసారం ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల సారమే భగవద్గీత. ఇది హిందువులకు అతి ముఖ్యమైనది. ఇది వేదవ్యాసునిచే సంస్కృతంలో రచంచబడిన మహాభారతంలోని భీష్మ పర్వము లోనిది.
విద్యాభ్యాసం శ్రవణ, మనన, నిధి ధ్యాస అనే మూడు దశలు దాటి ప్రత్యక్షానుభవంతో సంపూర్తి అవుతుంది. శాస్త్ర జ్ఞానం, పాఠకుని ఆధ్యాత్మిక స్థాయిని బట్టి, మూడు దశల్లో లభిస్తుంది. అవి తాత్పర్యార్థం, విశ్లేషణార్థం, అంతరార్థం, ఈ అంతరార్థం ప్రత్యక్షానుభవంతోనే లభ్యమై, నిర్ధారణ అవుతుంది. ఇదే విద్యకు చమర దశ.
చిన్నతనంలో నాన్న నాటిన బీజాలతో ఆరంభమయింది నా ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ ప్రయాణం రామకృష్ణ మఠం, చిన్మయా మిషన్ ద్వారా సాగి, పరమగురు భగవాన్ సత్యసాయి బాబా వారి శిష్యరికంలో పరిపక్వత చెందింది. దాని ఫలితమే ఈ రచన.
- డా. రాఘవేంద్ర ఎస్. ప్రసాద్