లక్ష్మీదేవిని చూసి విష్ణుమూర్తి నవ్వేడు. లక్ష్మి విష్ణుని నీ తల తెగిపడిపోవుగాక అంది. అంటే, విష్ణుని తల తెగపడింది. బ్రహ్మ విష్ణువు యొక్క మొండేనికి గుర్రం తలతెచ్చి అతికించేడు. ఇది లక్ష్మి హయగ్రీవావతార కథ. కరంభుడు అనేవాడు బ్రహ్మ చెప్పిన ప్రకారం తన ఎదుటనున్న గేదెతో రమించెను. ఆ గేదెకూ, కరంభునకు పుట్టినవాడు మహిషాసురుడు. వాడు శ్రీదేవిని తన్ను పెండ్లాడవలసిందిగా ఆర్గురు తన రాయబారుల ద్వారా కోరేడు. శ్రీదేవి వారి ఆర్గురనూ, మహిషాసురుణ్ణి కూడా చంపివేసింది. ఇది మహిషాసురమర్దినీ అవతార కథ. ఇలాంటి తలాతోకా లేని కథలెన్నో! ఇవి ముక్తినిస్తాయిట! ఇవి అవతారకథలు. ఎలాగు అవి ముక్తినివ్వడానికి సమర్ధంగా ఉన్నాయో వ్యుత్పత్యార్ధాలతో నిరూపించి శ్రీ శర్మగారు ముక్తి సౌధానికి మెట్లు కట్టి చూపించేరు. వీరు ఇంతకు పూర్వం రామాయణ, భారత, భాగవతాలకు కూడా అంతరార్ధాలు వ్రాసేరు, చదివి తరించండి.
లక్ష్మీదేవిని చూసి విష్ణుమూర్తి నవ్వేడు. లక్ష్మి విష్ణుని నీ తల తెగిపడిపోవుగాక అంది. అంటే, విష్ణుని తల తెగపడింది. బ్రహ్మ విష్ణువు యొక్క మొండేనికి గుర్రం తలతెచ్చి అతికించేడు. ఇది లక్ష్మి హయగ్రీవావతార కథ. కరంభుడు అనేవాడు బ్రహ్మ చెప్పిన ప్రకారం తన ఎదుటనున్న గేదెతో రమించెను. ఆ గేదెకూ, కరంభునకు పుట్టినవాడు మహిషాసురుడు. వాడు శ్రీదేవిని తన్ను పెండ్లాడవలసిందిగా ఆర్గురు తన రాయబారుల ద్వారా కోరేడు. శ్రీదేవి వారి ఆర్గురనూ, మహిషాసురుణ్ణి కూడా చంపివేసింది. ఇది మహిషాసురమర్దినీ అవతార కథ. ఇలాంటి తలాతోకా లేని కథలెన్నో! ఇవి ముక్తినిస్తాయిట! ఇవి అవతారకథలు. ఎలాగు అవి ముక్తినివ్వడానికి సమర్ధంగా ఉన్నాయో వ్యుత్పత్యార్ధాలతో నిరూపించి శ్రీ శర్మగారు ముక్తి సౌధానికి మెట్లు కట్టి చూపించేరు. వీరు ఇంతకు పూర్వం రామాయణ, భారత, భాగవతాలకు కూడా అంతరార్ధాలు వ్రాసేరు, చదివి తరించండి.© 2017,www.logili.com All Rights Reserved.